మన ఓటు మన హక్కు,మన భాద్యత, మన వజ్రాయుధము!
ఓటు నోటు ................డాక్టర్ భీమ్ రావ్ రాంజీ అంబేద్కర్ గారు రచించిన,మన రాజ్యాంగం ఇచ్చేను మనకు ఓటు అనే వజ్రాయుధమును హక్కు గా!మన ఓటు మన హక్కు,మన భాద్యత, మన వజ్రాయుధము!మన ఓటును వజ్రాయుధము గా వాడి రాజులు అవుతామో?మన ఓటును అమ్ముకొని ఓడిపోయి బానిసలు అవుతామో?మన చేతిలోనే కలదు నిర్ణయం!మన ఓటు అనే వజ్రాయుధము మార్చును మన చరిత్ర గతిని!మన ఓటు అనే వజ్రాయుధము మార్చును మన దేశభవితను!జీవుల మనుగడకు ఆక్సిజన్, నీరు, ఆహారము అవసరం!మన ప్రజాస్వామ్య మనుగడకు ఓటు అవసరం!మన ప్రజాస్వామ్యమునకు బలము ఓటు!నేడు నోటు కు బలి అవుతున్నది ఓటు!ఎన్నెన్నో బలిదానాలతో వచ్చినది మన ప్రజాస్వామ్యం!నోటు కు ఓటు తో అపహస్యం అవుతున్నది నేడు ప్రజాస్వామ్యం!ప్రజాస్వామ్యం ను బలి పీఠం నుండి కాపాడే బాధ్యత మనందరిది!!