logo

హామీలన్ని వెంటనే అమలు చేయాలి. - భూక్యా రమేష్. - సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం బ్రాంచ్ నాయకులు.

సింగరేణి వ్యాప్తంగా పనిచేస్తున్న సింగరేణి కాంటాక్ట్ కార్మికుల వేతనాలు డిసెంబర్ 9 లోపు పెంచకంటే , ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని,ఐక్య పోరాటాలకు సిద్ధమవుతామని సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం (ఎస్సి కేస్ ) బ్రాంచ్ నాయకులు భూక్యా రమేష్ హెచ్చరించారు. సింగరేణి కాంట్రాక్టు కార్మికుల పని ప్రాంతాల్లో జరిగిన మీటింగ్ లలో భూక్యా రమేష్ మాట్లాడుతూ సింగరేణి వ్యాప్తంగా పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల వేతనాలు పెంచుతామని చెప్పి సంవత్సర కాలం పరిపాలన కొనసాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. సింగరేణి యాజమాన్యం కూడా కార్మికుల శ్రమను గౌరవించకుండా, వేతనాలు పెంచకుండా, ఈఎస్ఐ అమలు చేయకుండా, ఏడవ తేదీలోపు జీతాలు ఇవ్వకుండా, కార్మికుల కడుపులు కొడుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు కార్మికులు పనిచేస్తున్న పని స్వభావాన్ని బట్టి నైపుణ్యం కలిగిన పనులు ఎలక్ట్రిషన్, సివిల్, వర్క్ లో బెల్ట్ క్లీనింగ్, డ్రైవింగ్ వంటి అనేక పనులు నైపుణ్యం కలిగి ఉన్నప్పటికీ వేతనాలు అన్ స్కల్డ్ ఇస్తున్నారని వారందరికీ స్కిల్డ్ వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అన్ని రకాలుగా సింగరేణి యాజమాన్యానికి అభివృద్ధికి పాటుపడుతున్న తమ నైపుణ్యంతోనే పనిచేస్తున్న కార్మికులకి హైస్కిల్డ్ వేతనాలు చెల్లించకుండా స్కిల్ వేతనాలతోని సరిపుచ్చుతూ శ్రమ దోపిడీ చేస్తున్నారని ఆయన విమర్శించారు. అధికారంలో రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులకి అనేక హామీలు ఇచ్చిందని ఈఎస్ఐ అమలు చేస్తామని సింగరేణి హాస్పిటల్ లో కుటుంబ సభ్యులందరికీ వైద్యం అందిస్తామని, ఏడవ తారీఖు లోపే వేతనాలు చెల్లిస్తామని ,కనీస వేతనాలు అమలు చేస్తామని తదితర హామీలు ఇచ్చిన ప్రభుత్వం సంవత్సర కాలం గడుస్తున్న ఒక్క సమస్య కూడా పరిష్కరించకుండా కాలయాపన చేస్తుందని భూక్యా రమేష్ అన్నారు. కాంటాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించుకుంటే ఐక్య పోరాటాలకు సిద్ధమవుతామని దశల వారీగా ఆందోళన నిరంతరం కొనసాగిస్తామని ఆయన హెచ్చరించారు. సింగరేణి కాంటాక్ట్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జరిగిన నవంబర్ 9న జరిగిన హెడ్ ఆఫీస్ వద్ద ధర్నా అనంతరం డైరెక్టర్ పా తో చర్చలు జరిపామని ఈ చర్చల సారాంశాన్ని సమస్యల పరిష్కారం కోసం తక్షణమే హామీలు పరిష్కారం చేస్తామని డైరెక్టర్ పా జి వెంకటేశ్వర రెడ్డి హామీ ఇచ్చారు . డైరెక్టర్ తోపాటు జీఎం పర్సనల్ శ్రీమతి కవితా నాయుడు మరియు వెల్ఫేర్ సెక్షన్ ఉన్నతాధికారులు కూడా పాల్గొని సిఐటియు నాయకత్వం విన్నవించిన సమస్యల ను త్వరలోనే పరిష్కారం చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. తక్షణమే హామీలు అమలు చేయాలని భూక్య రమేష్ సింగరేణి ఉన్నతాధికారులకు కోరారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం కాంట్రాక్టు కార్మికుల పట్ల సానుకూలంగా స్పందించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు .

ఈ కార్యక్రమంలో సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘం అధ్యక్షులు శ్యాం కుమార్ నందిపాటి రమేష్ గుగులోత్ సత్రం ప్రభాకర్ భాస్కర్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

8
990 views