భద్రాద్రి కొత్తగూడెం డిగ్రీ గెస్ట్ అధ్యాపకుల కమిటీ ఎన్నిక
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పనిచేసే గెస్ట్ అధ్యాపకులు నూతన కమిటీని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలో జరిగిన సమావేశంలో ఎన్నుకోవడం జరిగింది. రాష్ట్ర కమిటీ పర్యవేక్షకుడు డాక్టర్ రాజు రెడ్డి ఎన్నికల అధికారిగా వ్యవహరించారు.ఈ ఎన్నికల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిగా భూక్య జబ్బర్ (మణుగూరు),ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ వేణు పవన్ కుమార్ (పాల్వంచ),ఉపాధ్యక్షుడిగా ఎన్ వేణు కృష్ణ (భద్రాచలం), కోశాధికారిగా ఎన్ శ్రీనివాస్ రెడ్డి (భద్రాచలం),సంయుక్త కార్యదర్శిగా జె .రహమాన్ రాచల్, ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా జి వీరన్న (భద్రాచలం),ఎస్ నవీన్ కుమార్ (మణుగూరు),ఎస్ ఈశ్వర్ (ఇల్లందు),ఈ .శ్రీను, బి.రమేష్ ను ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన జిల్లా అధ్యక్షుడు ముఖ్య జబ్బర్ ను సభ్యులు ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా భూక్య జబ్బర్ మాట్లాడుతూ కళాశాలలో ఎదుర్కొంటున్న అనేక సమస్యలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా జరిపే పోరాటాలలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి రాష్ట్ర కమిటీకి అండదండలు అందించడం జరుగుతుందని, అందరూ సమైక్యంగా పోరాటం చేస్తే ఉన్నతమైన ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుందని అన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల విద్యార్థుల అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించే గెస్ట్ అధ్యాపకులకు చెల్లించే వేతన విషయంలో గాని ఇతర సౌకర్యాల్లో గాని అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాటిని ఎదుర్కొని విజయం సాధించడానికి ప్రయత్నిస్తానని ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు భూక్య జబ్బర్ అన్నారు.