logo

ఏకశిలలో జాతీయ బాలల దినోత్సవ వేడుకలు*

హనుమకొండ జిల్లా రెడ్డి కాలనీలోని ఏకశిల కాన్సెప్ట్ స్కూల్లో భారతదేశ తొలి ప్రధాని చాచా నెహ్రూ జన్మదినాన్ని పురస్కరించుకొని జాతీయ బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉన్నత తరగతులకు చెందిన విద్యార్థులు ఉపాధ్యాయులవలే పాఠాలు బోధించి స్వయం పరిపాలన దినోత్సవాన్ని నిర్వహించారు. డిస్ ప్లే బొర్డ్స్, చార్టులు, టి ఎల్ ఎం తీసుకువచ్చి పాఠాలు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏకశిలా విద్యాసంస్థల ఛైర్మన్ డాక్టర్ గౌరు తిరుపతి రెడ్డి గారు పాల్గొని నేటి బాలలే రేపటి పౌరులను, పిల్లలంతా క్రమశిక్షణ, నైతిక విలువలతో జీవించాలని సూచించారు. సమయాన్ని వృధా చేయకుండా చదువుకొని ఉన్నత పౌరులుగా, దేశానికి తమ వంతు సేవ చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రాధమిక స్థాయి విద్యార్థులు చాచా నెహ్రూ వేషధారణలో అలరించారు. ఈ కార్యక్రమంలో వైస్-ప్రిన్సిపల్ స్వప్నా రెడ్డి, ఉపాద్యాయులు వనిత,జయ,పవన్ విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు.

16
6434 views