గిరిజనుల జోలికొస్తే సహించేది లేదు సేవాలాల్ సేన
కొడంగల్ నియోజకవర్గ అమాయక గిరిజనుల జోలికొస్తే ఊరుకోం సేవాలాల్ సేన హన్మకొండ మరియు వరంగల్ జిల్లా అధ్యక్షులు కునుసొతు మురళి నాయక్. ఈరోజు హనుమకొండ జిల్లాలోని వడ్డేపల్లి చర్చి ప్రాంగణంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పై విరుచుకుపడ్డ సేవాలాల్ సేన నాయకులు కొడంగల్ లో గిరిజన తండాల్లో ఫార్మా కంపెనీ పేరుతో అమాయక కొడంగల్ గిరిజన రైతుల వద్ద భూములను గ్రామసభ పేరుతో తండాలలో అధికారులను పంపించి భయభ్రాంతులను గురి చేస్తూ అలాంటి వాతావరణం కల్పించి వారిని విచక్షణ రహితంగా కొట్టి అమాయక రైతుల పైన అక్రమంగా నమోదు చేసిన కేసులను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని సేవాలాల్ సేన హన్మకొండ మరియు వరంగల్ జిల్లా అధ్యక్షులు మురళి నాయక్ డిమాండ్ చేశారు కొడంగల్ నియోజకవర్గంలోని ఎనిమిది తండాల రైతుల కుటుంబాలు వ్యవసాయంపై ఆధారపడి పొట్టకూటి కోసం నివసిస్తున్నాయి గిరిజనుల భూములను ఫార్మా కంపెనీ పేరుతో కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం లాక్కోవడం చాలా బాధాకరమైన విషయం గిరిజనుల వారి భూమి గనుక వారికి తిరిగి ఇవ్వకపోతే వారి యొక్క భూముల జోలికొస్తే ఇక సహించబోమని అలాగే రానున్న రోజులలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తండాలలో తిరగబోనివ్వమని సేవాలాల్ సేన నాయకులు పెద్ద ఎత్తున హనుమకొండ మరియు వరంగల్ జిల్లాలో నిరసన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సేవాలాల్ సేన రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ నాయక్ జిల్లా ఉపాధ్యక్షులు ఇస్లావత్ మోహన్ నాయక్ హసన్పర్తి మండల అధ్యక్షులు రాజు నాయక్ మరియు నవీన్ నాయక్ సేవాలాల్ సేన జిల్లా నాయకులు వసంత నాయక్ రాజకుమార్ నాయక్ రవి నాయక్ కుమార్ నాయక్ వీరన్న నాయక్ తదితరులు పాల్గొన్నారు.