logo

రేచపల్లిలో జరిగిన పోగుల లత అంతిమ యాత్ర రాష్ట్ర నలు మూలల నుండి తరలి వచ్చిన ప్రజా సంఘాలు, హక్కుల సంఘాలు వరకట్న చావులకు - వేధింపులకు వ్యతిరేకంగా నినాదాలు పోరాటాలకు సిద్దం కావాలని పిలుపు నిచ్చిన సంఘాలు

రేచపల్లిలో జరిగిన పోగుల లత అంతిమ యాత్ర

రాష్ట్ర నలు మూలల నుండి
తరలి వచ్చిన ప్రజా సంఘాలు, హక్కుల సంఘాలు

వరకట్న చావులకు - వేధింపులకు వ్యతిరేకంగా నినాదాలు

పోరాటాలకు సిద్దం కావాలని పిలుపు నిచ్చిన సంఘాలు

రేచపల్లి / సారంగాపూర్ / జగిత్యాల జిల్లా:


ఈ నెల 8 శుక్రవారం అదనపు వరకట్న వేధింపులతో రేవోజీపేటలో దారుణ హత్య కు గురైన పోగుల (చంద) లత అంతిమ యాత్ర మంగళ వారం జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం రేచపల్లిలో ఆమె తల్లి గారి ఇంటి నుండి జరిగింది. మృతురాలికి ఏడాదిన్నర కొడుకు ఉండగా ఆమె తల్లి పోగుల మల్లేశ్వరి అగ్గి పట్టి శవ యాత్ర నిర్వహించారు. ఈ అంతిమ యాత్రకు రాష్ట్ర నలు మూలల నుండి ప్రజా సంఘాలు, హక్కుల సంఘాలు, మహిళా సంఘాలు తరలి వచ్చాయి. గ్రామస్తులు, జిల్లా వాసులు కూడా అధిక సంఖ్యలో ఈ అంతిమ యాత్రలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ లత హత్య పట్ల నిరసనలు తెలుపుతూ, వరకట్నాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వరకట్న దురాచారంతో భర్త, అత్త - మామలచే కౄరంగా హత్య చేయబడ్డ పోగుల లత పట్ల సరైన న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని తేల్చి చెప్పారు. పోగుల లతకు జోహార్లు అర్పిస్తూ ప్రజా సంఘాల వారు, హక్కుల సంఘాల వారు, మహిళా సంఘాల వారు మాట్లాడారు.
హంతకులను, వారి వెంట ఉండి ధలారులుగా వ్యవహరిస్తున్న వారిని ప్రభుత్వం వెంటనే చట్ట ప్రకారము కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
"లత హత్య" ను ఆత్మహత్యగా చిత్రీకరించిన వారితో పాటు అండగా ఉన్న దళారీ మాఫియాను ప్రభుత్వం వెంటనే అరెస్ట్ చేయాలని కోరారు.
ప్రజలారా.... ప్రజాస్వామిక వాదులారా.... మహిళలపై జరుగుతున్న కుటుంబ హింస, లైంగిక దాడులు, అత్యాచారాలు, హత్యలకు వ్యతిరేకంగా పోరాడుదాం అంటూ నినాదాలు చేశారు. రేచపల్లి గ్రామంలోని ప్రజా కూడలి ప్రదేశంలో పౌర హక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మాధన కుమార స్వామి, సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ ఉద్యమ కారుడైన తెలంగాణ జన సమితి జగిత్యాల జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి లు మాట్లాడుతూ పెండ్లి అయిన ఆరు నెలల నుండి పోగుల లత వరకట్న వేధింపులకు గురైన తీరు, పలు మార్లు జరిగిన పంచాయతీల వివరాలు, రాసుకున్న పాబందులు, హత్య పట్ల వారు గత ఐదు రోజులుగా చేపట్టిన నిజ నిర్ధారణలో వెల్లడైన పలు కీలక అంశాలను ప్రజలకు, మహిళలకు వివరించారు. ఇలాంటి దుర్మార్గపు హత్యలు, వరకట్న వేధింపులు పునరావృతం కాకుండా మహిళలు, ప్రజా సంఘాలు, హక్కులు సంఘాలు కలిసి పోరాటాలు చేయాలని, ఏ ఆడబిడ్డకు కూడా అన్యాయం జరుగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు కండ్లు తెరచి, చిత్త శుద్ధితో మహిళలపై, యువతులపై జరుగుతున్న దాడులు, హత్యలు,, హింసలు, వేధింపులు, వరకట్నాలపై కఠినమైన చర్యలుచేపట్టాల్సిందిగా వారు కోరారు.
ఈ అంతిమ యాత్రలో పోగుల లత కుటుంబీకులు, ఆమె తల్లి గారి పక్షాన బంధు మిత్రులు, హక్కుల నేత పోగుల రాజేశం అభిమానులు, ప్రజా సంఘాల, హక్కుల సంఘాల, మహిళా సంఘాల ప్రతినిధులు, వివిధ గ్రామాల, మండలాల, జిల్లాల మాజీ ప్రజా ప్రతినిధులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

అంత్యక్రియలో పాల్గొన్నవారు

పౌర హక్కుల సంఘము రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణ రావు, సహాయ కార్యదర్శి మాదన కుమారస్వామి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు శ్రీపతి రాజు గోపాల్, ప్రతినిధులు నార వినోద్ బొడ్డుపల్లి రవి, కడ రాజయ్య , పుల్ల సుచరిత, హైదారాబాద్ ప్రతినిధులు బాబు, విజయ్, హనుమంతరావు, వరంగల్ జిల్లా ప్రతినిధులు రమేష్, చందర్, జయంతు, సారంగపాణి, అదిలాబాద్ జిల్లా ప్రతినిధులు బుద్ధ సత్యం, పోశం సారయ్య, చైతన్య మహిళా సంఘం ప్రతినిధులు అనిత, శ్రీదేవి, పద్మ కుమారి, తెలంగాణ జన సమితి జగిత్యాల జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి, ప్రజా సంఘాల నాయకులు పొన్నం రాయమల్లు, సాన నారాయణ, పెద్దన వెని రాగన్న, మాసర్తి రాజిరెడ్డి, ఐద్వా నాయకురాలు వెల్గొండ పద్మ, నేషనల్ హుమాన్ రైట్స్ కౌన్సిల్ ఎన్.జి.ఓ. ప్రతినిధులు నక్క గంగారాం, విరసం నేత బాలసాని రాజన్న, పెద్ద పెళ్లి జిల్లా నుండి రైతు సమస్యల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ముడిమడుగుల మల్లన్న, ఎరుకల రాజన్న బియ్యాల స్వామి, గాండ్ల మల్లేశం, గుమ్మడి కొమరయ్య, పొన్నం రాయమల్లు, దళిత లిబరేషన్ ఫ్రంట్ రాష్ట్ర కార్యదర్శి మార్వాడి సుదర్శన్, ఉద్యమకారులు రామిండ్ల బాబు, సుశీల, పోనకంటి కైలాసం, పొన్నం రాయమల్లు భారత్ బచావో నాయకులు నారాయణ, చుట్టుపక్క గ్రామాల , వివిధ ప్రాంతాల ప్రజలు అంత్యక్రియలకు అధిక సంఖ్యలో హాజరయ్యారు.

1
1341 views