logo

*రైతు సమస్యలను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం **

జమ్మలమడుగు
నవంబర్ 12

రైతులను కూటమి ప్రభుత్వం నిలువునా ముంచింది. రైతు సమస్యలను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుందని
జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్ రెడ్డి తెలియజేశారు..

గ్రామ రెవెన్యూ సదస్సులో భాగంగా నిడుజివ్వి గ్రామంలో రైతుల భూ సమస్యల పైన డిప్యూటీ తాహసిల్దార్ యామని కి వినతి పత్రం అందించారు
రైతులకు మేలు చేస్తామని నమ్మించి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులను దగా చేదిందన్నారు. ప్రభుత్వం ఏర్పడి ఐదు నెలలు కావస్తున్న ఇప్పటి వరకు రైతు భూ సర్వే సమస్యలను మార్ట్గేసింగ్ సమస్యలను పరిష్కరించలేదన్నారు.
కేంద్ర ప్రభుత్వం రైతు భరోస అందజేసిన ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన రూ 20 వేలు రైతు భరోసాను రైతులకు అందించలేదన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం రబీ సీజన్లో రైతులకు ఇచ్చిన శనగ విత్తనాలు నాణ్యత లేకపోవడం వలన పంట వేసి పది రోజులు దాటిన ప్రభుత్వ సరఫరా చేసే విత్తనాలు మొలకెత్తలేదు
దీనివల్ల రైతులు చాలా నష్టపోయారు అన్నారు. ఈ ప్రభుత్వం రైతులను నమ్మించి మోసం చేసిందని ఆయన ధ్వజమెత్తారు.

0
2569 views