logo

క్షేత్రస్థాయిలో కార్యకర్తలు కష్టపడి పని చేయాలి.తెలంగాణ ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్


మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా దెగ్లూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బిలోలి తాలూకా లోని కొండల్ వాడి గ్రామములో రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ గారు ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించి వారిని చేతన పరిచి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసే విధంగా కార్యకర్తలు కష్టపడి పని చేయాలన్నారు. దెగ్లూర్ కాంగ్రెస్ అభ్యర్థి నివర్తి రావును అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు.

1
40 views