logo

రాష్ట్ర బడ్జెట్లో చేనేత నిధులు పెంచాలి చేనేత కులాలకి రాజకీయ ప్రాధాన్యత కల్పించాలి పప్పు రాజారావు డిమాండ్

ఆకర్ష్ టీవీ ఆంధ్రప్రదేశ్ :మంగళగిరి-విజయవాడ బైపాస్‌లోని కొలనుకొండ సమీపంలో పద్మశాలీ ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్(PIWA) ఆధ్వర్యంలో చేపడుతున్న నూతన పద్మశాలీ భవన్ శంకుస్థాపన కార్యక్రమానికి విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పద్మశాలీ భవన్ కు శంకుస్థాపన చేశారు. పద్మశాలీ ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ కేంద్ర కమిటీ అధ్యక్షులు స్వర్గం పుల్లారావు దంపతులు పూజా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమములో రాష్ట్ర పద్మశాలి సంఘం కన్వీనర్ మరియు ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పప్పు రాజారావు , తెడ్లపు వెంకటేశ్వరరావు , కొప్పల రామ్ కుమార్, కులపాక సన్యాసిరావు , వానపల్లి గాయత్రి ఫణి కుమారి గారు, వానపల్లి సత్య, రాపర్తి సుబ్బారావు గారు,సూరిసెట్టి సూరిబాబు, కొప్పల రమేష్ ప్రభావతి, వానపల్లి అరుణలత, మాడెం సూరి అప్పరావు, డా. రాజు, నాలి అప్పారావు, గుదే వేణు, గుదె రాజు, కరణం వెంకటేశ్వరరావు,BPS కల్యాణి, మరియు ఉత్తరాంధ్ర పద్మశాలి ప్రముఖులు పాల్గొని శంకుస్థాపన కార్యక్రమం జయప్రదం చేయడం జరిగింది, ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ మంగళగిరిలో అంతర్జాతీయ ప్రమాణాలతో వీవర్స్ శాల ఏర్పాటుచేసి చేనేత కుటుంబాలకు అండగా నిలిచామన్నారు. చేనేత మహిళలకు పెద్దఎత్తున ఆధునిక రాట్నాలను పంపిణీ చేశామని తెలిపారు. ఈ సందర్భంగా పప్పు రాజారావు నారా లోకేష్ తో మాట్లాడుతూ చేనేత కులాలకి రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని , చేనేత కుల వృత్తిని అభివృద్ధి చేయాలని రాష్ట్ర బడ్జెట్లో చేనేత నిధులు పెంచాలని మగ్గం నేసే ప్రతి కళాకారులకు పెన్షన్ ఇవ్వాలని కోరారు.

0
359 views