logo

స్కూల్ బస్సులను ప్రమాదాలలోకి నెట్టి వేస్తున్న క్వారీ లారీలు.పట్టించుకోని అధికారులు...

రోలుగుంట: మండలంలోని కొవ్వూరు రహదారిలో తిరిగే క్వారీ లారీల వలన స్థానిక ప్రజలు, స్కూల్ పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు.రోడ్లు పూర్తిగా పాడవుతున్న అధికారులు ఏమాత్రం పట్టించు కున్న దాఖలాలు లేవు.ఈ క్వారీ లారీల వల్ల రోడ్లు పూర్తిగా పాడైపోయాయని ఇదే దారిలో ప్రయాణిస్తున్న స్కూల్ బస్సులకు ప్రమాదం ఏదైనా జరిగితే దానిలో ప్రయాణిస్తున్న పిల్లలకి ప్రమాదం జరిగితే బాధ్యులు ఎవరు అని పిల్లల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.ఈ విషయంలో అధికారులు తక్షణం స్పందించి తగిన చర్యలు చేపట్టకపోతే తీవ్ర ఆందోళన చేయడం జరుగుతుందని మండల బిజెపి మాజీ అధ్యక్షులు చవ్వాకుల భాస్కర్,కొవ్వూరు యూత్ సభ్యులు హెచ్చరించారు...

11
5586 views