logo

హైందవ శంఖారావం కార్యక్రమం విజయవంతం చేయాలి.. మన దేవాలయాలు రక్షించుకుందాం- ఓలేటి సత్యనారాయణ


ఆకర్ష్ టీవీ అనకాపల్లి: అనకాపల్లి విజయరామరాజు పేట లో మాధవసధన్ లో అనకాపల్లి జిల్లా విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షులు బి.సత్యనారాయణ అధ్యక్షతన హైందవ శంఖారావం కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఓలేటి సత్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ 2025 జనవరి మాసంలో 5 వ తేదీన విజయవాడలో జరిగే హైందవ శంఖారావం కార్యక్రమం విజయవంతం చేయాలి అని ఆర్.ఎస్.ఎస్.ప్రాంత కార్యకారిణి సభ్యులు ఓలేటి సత్యనారాయణ పిలుపు నిచ్చారు. అధేవిధంగా చలో విజయవాడ కరపత్రాన్ని విడుదల చేసారు.ప్రతి హిందూవు దేవాలయాల రక్షణ కోసం దీక్ష బునాలని పిలుపునిచ్చారు. అనంతరం
దేవాలయాలకు స్వయంప్రతిపత్తి కలిగించేలోగా దేవాలయాల నిర్వహణలో చేయాల్సిన సంస్కరణలు

1 . దేవాలయాలలో, దేవదాయ ధర్మదాయశాఖలో పనిచేస్తున్న అన్యమత ఉద్యోగులను తొలగించాలి.

2 . దేవాలయాలన్నింటా పూజా, ప్రసాద కైంకర్య సేవలన్నీ అత్యంత భక్తి శ్రద్ధలతో, నాణ్యతతో నిర్వహించేలా చూడాలి. దీని ఉల్లంఘనలకు పాల్పడితే దోషులను కఠినంగా శిక్షించాలి.

3.ఔట్సోర్సింగ్ ఉద్యోగులలో కూడా హిందువులు మాత్రమే ఉండాలి.

4.దేవాలయ ట్రస్టు బోర్డులలో రాజకీయపార్టీలతో ప్రమేయంలేని హిందూ దైవ భక్తులుమాత్రమే ఉండాలి.

5.దేవాలయాల నిర్వహణపై ధర్మాచార్యులు తయారు చేసిన నమూనా విధివిధానాలను అమలు చేయాలి.

6.దేవాలయాల పరిసరాలలోని దుకాణాలు అన్నీ హిందువులకు మాత్రమే కేటాయించాలి.

7.దేవాలయాల ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే అన్యాక్రాంతం అయిన ఆస్తులను వెంటనే స్వాధీనం చేసుకోవాలి.

8 హిందూ సమాజంపై, హిందూ ఆలయాలపై ఉన్మాదంతో కుట్రపూరితంగా దాడులు చేస్తున్న విధర్మీయులు, విద్రోహులను ప్రభుత్వాలు గుర్తించి అత్యంత కఠినంగా శిక్షించాలి.

9 హిందూ దేవాలయాల భూముల్లో అన్యమతస్తుల ద్వారా అక్రమంగా నిర్మించబడ్డ కట్టడాలన్నీ వెంటనే తొలగించాలి.

10.దేవాలయాల ఆదాయాన్ని కేవలం ధర్మప్రచారానికి మరియు సేవలకు మాత్రమే ఉపయోగించాలి. ప్రభుత్వ ప్రజాపాలనా కార్యాలకు వినియోగించరాదు. అని తెలియజేసారు. విశ్వ హిందూ పరిషత్ అనకాపల్లి జిల్లా కార్యదర్శి మరియు హైందవ శంఖారావం కన్వీనర్ బుద్ధ సీతారాం ఈ కార్యక్రమం కి ప్రతి హిందూవు తప్పనసరిగా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని నమోదు ప్రక్రియను వివరించారు.

ఈ కార్యక్రమం లో హైందవ శంఖారావం కమిటీ కో కన్వీనర్ M.J.P.కొండలరావు, నిధి ప్రముఖ్ ఆర్సీ నాగేశ్వరరావు, సోషల్ మీడియా ప్రముఖ్ జి.ఎల్.ఎం. శాస్త్రి, కన్వీనర్ దొడ్డి వెంకటరావు, ప్రచార సామాగ్రి ప్రముఖ్ కర్రి లీలానాయుడు, మీడియా ప్రముఖ్ కె.రమేష్, రవాణా ప్రముఖ్ వి.నర్సింగ్ యాదవ్ మరియు ఆర్.ఎస్.ఎస్, వి.హెచ్.పి, ఎస్.ఎస్.ఎఫ్, బి.ఎమ్.ఎస్, మొదలగు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

10
3516 views