*పొగిరి గ్రామం లో అవగాహనా సదస్సు* మద్యం గొలుసు దుకాణాల నియంత్రనే లక్ష్యం
విజయనగరం జిల్లా. రాజాం. ఈరోజు రాజాం మండలం పొగిరి గ్రామంలో రాజాం, ప్రోహిబిషన్ & ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఆర్. జైభీమ్ అక్రమంగా మద్యం అమ్మకాలను నిరోదించే ఉద్దేశ్యం తో పొగిరి గ్రామం లోని ప్రజలకు చైతన్య పరిచే విధంగా అవగాహనా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమం లో బెల్ట్ షాప్ల వలన గ్రామానికి జరుగు అనర్దాల గురించి వివరించడం జరిగింది. బెల్ట్ షాప్ నిర్వహిస్తూ పట్టుబడిన వారికి చట్ట ప్రకారం ఉన్న శిక్షలు గురించి వాటి తీవ్రత వివరించడం జరిగింది. గ్రామంలో ఎవరైనా అక్రమంగా బెల్ట్ షాప్ లు నిర్వహిస్తున్నట్లయితే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కి సమాచారం ఇవ్వవలసిందిగా కోరడమైనది.సమాచారం ఇచ్చిన వారి వివరాలు గొప్యంగా ఉంచబడతాయని సీఐ ఆర్.జై భీమ్ తెలిపారు.