logo

ఆరంభ టౌన్షిప్ నందు కార్తీక మాస వనభోజన మహోత్సవం

తేదీ: 9 -11 -2024, ఈరోజు ఆరంభ టౌన్ షిప్ నందుక కార్తీక మాస వనభోజన మహోత్సవం, అత్యంత ఆనందోత్సహాల మధ్య కోలాహాలంగా జరిగింది. కార్తీకమాస వనభోజన ఉత్సవ కార్యక్రమం అనాదిగా వస్తున్న ఆచారం. అందులో భాగంగా కాలనీవాసులందరూ, కుటుంబ సభ్యులతో ,మరియు టౌన్షిప్ లో ఉన్నటువంటి యావన్మంది ప్రజలు స్త్రీలు, పురుషులు, పిల్లలు, అందరూ కలిసి ఉసిరిక చెట్లు వద్ద పూజలు చేసి, స్వతహాగా వండిన వంటలను అందరికీ కొసరి కొసరి వడ్డించుకొని, తోటలో వన భోజనాన్ని చేశారు. తదనంతరం అందరూ ఆనందంగా ఉత్సాహంగా క్రీడా పోటీలలో పాల్గొన్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆల్ ఇండియా మీడియా కొంతమంది పెద్దలను కలిసి ముచ్చటించింది. ఇలాంటి కార్యక్రమం వలన సమాజంలో నూతన పరిచయాలు, సంఘటితశక్తి, సమాజాభివృద్ధి, సంఘ అభివృద్ధికి దోహదమయ్యే విషయాలపై అనేక రకాల చర్చలు, పరిష్కారాలు, వంటివి జరుగుతాయి అని అన్నారు. కార్తీక మాసంలో జరుపుకునే ఈ ఉత్సవం అత్యంత మనోహరంగా సాగినది.
ఈ కార్యక్రమంలో విజయలక్ష్మి, సత్యవాణి, త్రివేణి, సత్య, నీలిమ, పూజ, శేషారత్నము, ప్రశాంతి, కాంచన, హైమావతి, తదితరులు పాల్గొన్నారు.

61
1467 views