logo

Forgot about Drunk and Drive Cases in Machilipatnam, Krishna District, Andhra Pradesh, India.

*మచిలీపట్నం, కృష్ణా జిల్లా*

వాహన తనిఖీ, డ్రంక్ అండ్ డ్రైవ్, విజిబుల్ పోలీసింగ్ ని మరచిపోయిన కృష్ణా జిల్లా ట్రాఫిక్ పోలీసులు.

ట్రాఫిక్ పోలీస్ అధికారులు మీరు ఎక్కడ మరియు మీరు డ్యూటీ సక్రమంగా చేస్తున్నారా.

షుమారు ఐదు సంవత్సరాలు కిందట బందర్ ట్రాఫిక్ లో ఒక స్ట్రిక్ట్ పోలీస్ అధికారి గా చంద్ర బోస్ పేరు మారు మోగింది.
ఎవ్వరి పేరు చెప్పినా ఎవ్వరి తాలూకా అయినా ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన వారికీ ఫైన్ రాయకుండా వదిలేవాడు కాదు. డ్రైవింగ్ లైసెస్ లేకపోయినా, ఎటువంటి డాకుమెంట్స్ లేకపోయినా, డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన అయన పని చట్టానికి లోబడి పనిచేస్తారు. బందర్ లో ఉన్న అన్ని స్కూళ్లు, కాలేజీల్లో ఎస్సై మస్తాన్ ఖాన్ మరియు చంద్ర బోస్ లు అవగాహన సదస్సులు నిర్వహించిన ఘనత, రోడ్లు మీద తిరిగే ఆవులు, గేదలను ట్రాఫిక్ సిబ్బంది మరియు AR QRT టీమ్, మునిసిపాల్టీ సిబ్బంది సహకారంతో బందుల దొడ్లోకి తోలి యజమానులకు మున్సిపాలిటీ ద్వారా ఫైన్ కట్టించిన ఘనతకూడా వారికే దక్కింది, అయన వృత్తి న్యాయబద్దం గా, ఉన్నతధికారుల ఆదేశాలను తుచ తప్పకుండా పనిచేసేవారు. కోనేరు సెంటర్, గాంధీనగర్ హైనీ స్కూల్ ఏరియా, చిలకలపూడి రైల్వే స్టేషన్ ఏరియా, మచిలీపట్నం రైల్వేస్టేషన్ ఏరియా, మూడు స్తంబాలు ఏరియా, కాలేఖాన్ పేట ఏరియా ఎక్కడైనా సరే ఏ తప్పు చేసిన Unforgiven అనే అయన నైజం.

ఆలా ముక్కు సూటిగా, నిక్కచ్చిగా ఉండే అధికారులు ఎందుకు బందరు వదిలి వెళ్ళిపోతున్నారు??

ట్రాఫిక్ ని కష్టం గా కాకుండా ఇష్టం గా పనిచేసే అధికారులు మన బందర్ లో లేరా???

అలాంటి ఆరు అడుగుల బుల్లెట్ ని బందర్ ట్రాఫిక్ కి తీసుకువచ్చి బందర్ ట్రాఫిక్ ని
*మూడు స్తంభాల సెంటర్ నుండి కోట వారితుళ్లు పోర్ట్ రోడ్డు,*
*ఇనగూదురు పోలీస్ స్టేషన్ నుండి పరస్ పేట సెంటర్,*
*తాతారావు స్వీట్స్ షాప్ నుండి కళ్యాణి ప్రెస్ రోడ్డు,*
*చల్లరాస్తా సెంటర్ నుండి ట్రాఫిక్ స్టేషన్, శక్తీ గుడి రోడ్డు,*
*నాగ పోతారావు సెంటర్ నుంచి జిల్లా పరిషత్ సెంటర్ వరకు,*
*దిమ్మల సెంటర్ నుండి బైపాస్ రోడ్డు మౌనిక టవర్స్ వరకు*
*శివాలయం గాంధీ బోమ్మ సెంటర్ నుండి బుట్టాయి పేట సెంటర్*
*రేవతి సెంటర్ నుండి రామానాయుడు పేట సెంటర్ వరుకు*
ట్రాఫిక్ ని క్రమబద్ధీకరించాలని, బస్ స్టాండ్ రోడ్డు, రైతు బజార్, సాయి బాబా గుడి వద్ద రోడ్డుని అడ్డగోలుగా ఆక్రమించిన హకర్స్ ని పూర్తిగా తొలగించి వారి పొట్ట కొట్టకుండా వారిని పూర్తి గా వెనక్కు జరిపి, బందరు ప్రజల కష్టార్జితంతో ఏర్పాటు కొద్దీ నెలలు క్రితం చేసిన ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థను తుప్పు పట్టి పోకముందే ఉపయోగంలోకి తీసుకురావాలని, రోడ్ల మీద అడ్డ గొలుగా ఇష్ట రాజ్యం గా తిరుగుతూ వాహనదారుల ప్రాణాలను బలి తీసుకుంటున్న ఆవులు గేదలని బందుల దొడ్లో పెట్టి బందరు ప్రజలను, వారి ప్రాణలను కాపాడవలసిందిగా, ట్రాఫిక్ ఫ్రీ ఫ్లో గా సాఫిగా వెళ్లే టట్లు చూడాలని బందరు ప్రజలు కోరుకుంటున్నారు.

Regards,
Vijay Naidu,
Advocate and Senior Legal Journalist

7
1818 views