logo

బెస్ట్ ఫ్రెండ్స్ హెల్ప్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ ను సన్మానించిన డిసిసిబి చైర్మన్. ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ సామాజిక సేవా సంఘం బెస్ట్ ఫ్రెండ్స్ హెల్ప్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ కు యంగ్ ఇండియా బ్లడ్ డోనర్స్ క్లబ్ ఆధ్వర్యంలో యంగ్ ఇండియా సేవా పురస్కారం జాతీయ అవార్డు రావడం తో శుక్రవారం డిసిసిబి చైర్మన్ అడ్డి బోజా రెడ్డి అబ్దుల్ అజీజ్ ను శాలువాతో సన్మానించడం జరిగింది

. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జిల్లాలో కుల మతాలకు అతీతంగా ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తున్న బెస్ట్ ఫ్రెండ్స్ హెల్ప్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ కు యంగ్ ఇండియా సేవా పురస్కారం జాతీయ అవార్డు రావడం సంతోషకరంగా ఉందని. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఎంత గర్వ కారణమని అత్యవసర సమయంలో మేమున్నామని అండగా నిలిచే ఇలాంటి సామాజిక సేవా సంఘాలు,సంస్థలు జాతి అభివృద్ధి కి వెలుగు దివ్వేలని , అబ్దుల్ అజీజ్ కు వారి సొసైటీ కి అభినందనలు అని అన్నారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్ శ్రావణ్ నాయక్ ,కాంగ్రెస్ నాయకులు మునిగేలా నర్సింగ్,మొయిన్, ఇర్శాద్,తది తరులు పాల్గొన్నారు.

0
3417 views