logo

రాజాంలో విస్తృతంగా వాహనాలు తనిఖీ చేస్తున్న ప్రొహిబిషన్ & ఎక్సైజ్ అధికారులు


*అక్రమ మద్యం రవాణా నియంత్రనే లక్ష్యం*

విజయనగరం జిల్లా. రాజాం.

ఈరోజు రాజాం నగర చివార్లలో గల పొగిరి, బొద్దాం వైపు వెళ్లే రహదారి పై రాజాం, ప్రోహిబిషన్ & ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఆర్. జైభీమ్ ఆధ్వర్యంలో వాహన తనిఖీలను విస్తృత స్థాయిలో చేపట్టారు. మద్యం అక్రమంగా రవాణా చేసేవారిని పట్టుకోవడానికి తద్వారా అన్నదికారికంగా మద్యం రవాణా చేసి గొలుసు దుకాణాలను ఏర్పాటును నిరోధించడానికి ఈ తనిఖీ లు నిర్వహిస్తున్నట్టు సీఐ తెలిపారు. ఎవరైనా వాహన చోదకులు 3 మద్యం సీసాల కంటే ఎక్కువగా కలిగి ఉంటే పట్టుకొని కేసు నమోదు చేస్తామని అంతే కాకుండా వారి రవాణా కు ఉపయోగించిన వాహనాలను కూడా కేసులో భాగంగా సీజ్ చేయడం జరుగుతుందని కూడా సీఐ తెలిపారు. ఇటువంటి వాహన తనిఖీలకు వాహన చోదకులందరు ఎక్సైజ్ శాఖ వారికి సహకరించివలిసిందిగా సీఐ కోరారు. ఈ తనిఖీ ల్లో ఎస్.ఐ. జి. ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

9
5423 views