ఎమ్మెల్సీ దండే విఠల్ గారిని మర్యాద పూర్వకంగా కలిసిన కొలవార్(మన్నెర్ వార్) సేవా సంఘం నాయకులు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ గారిని ఆదివాసీ కొలవార్ సేవా సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్ఛం అందజేశారు. ఆనంతరం ఆదివాసీ కొలవార్ లు ఎదుర్కుంటున్న సమస్యలను గౌరవ ఎమ్మెల్సీ గారి దృష్టికి తీసుకెళ్లారు. కొలవార్లు ప్రధానంగా ఎదుర్కుంటున్న PVTG సమస్యను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ గారిని కోరారు. అనంతరం ఎమ్మెల్సీ గారికి మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ సానుకూలంగా స్పందించారు.ఈ కార్యక్రమంలో కొలవార్ సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు మెరిపెళ్లి సదాశివ, రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు మెరిపెళ్లి బ్రహ్మయ్య , రాష్ట్ర అధ్యక్షుడు పారిపెళ్లి పోచం,ఉపాధ్యక్షుడు బుర్సా రంగయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మండిగా రవీందర్, రాష్ట్ర యూత్ కన్వీనర్ బుర్సా వెంకటేష్, రాష్ట్ర కార్యదర్శులు తుమ్మిడి అశోక్, ఎరగటి సుధాకర్ లు పాల్గొన్నారు.