logo

రైతుల పాలిట వరం 500 రూ"ల సన్నబియ్యం బోనస్ - రాష్ట్ర మార్క్ ఫెడ్ డైరెక్టర్ కొత్వాల*

Telangana state,: bhadradri kothagudem Jilla:: palvancha mandalam::( November 07)

*రైతుల పాలిట వరం 500 రూ"ల సన్నబియ్యం బోనస్ - రాష్ట్ర మార్క్ ఫెడ్ డైరెక్టర్ కొత్వాల*

వరి ధాన్యం పండించే రైతుల పాలిట వరం 500రూ"ల సన్న బియ్యం బోనస్ పథకం అని *DCMS చైర్మన్, రాష్ట్ర మార్క్ ఫెడ్ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు* అన్నారు. కొత్తగూడెం చుంచుపల్లి మండలం పరిధిలోని పెనగడప గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం *కొత్తగూడెం నియోజకవర్గం శాసన సభ్యులు కూనంనేని సాంబశివరావు* ప్రారంభించగా *కొత్వాల* అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కార్యక్రమాన్ని ప్రతిష్టాకరంగా చేపడుతుందని అన్నారు. సన్న ధాన్యం పండించే రైతులకు 500రూ " లు బోనస్ గా ఇవ్వనున్నదని *కొత్వాల- అన్నారు.

ఈ కార్యక్రమంలో *కొత్తగూడెం సొసైటీ చైర్మన్ మండే హనుమంతరావు, CPI జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా, PCC సభ్యులు నాగ సీతారాములు, పాల్వంచ మండల అధ్యక్షులు కొండం వెంకన్న, ఉండేటి శాంతివర్ధన్, సహకార అధికారులు, మార్కెటింగ్, పౌర సరఫరాల శాఖ, రెవిన్యూ అధికారులు* పాల్గొన్నారు.

100
4661 views