logo

రైతులు ప్రభుత్వ నిబంధనలు పాటించి సన్నరకం ధాన్యంపై 500 రూపాయలు బోనస్ పొందేలా చర్యలు తీసుకోవాలి* --- *రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, DCMS చైర్మన్ కొత్వాల*

Telangana state:: bhadradri district:: November 06


*రైతులు ప్రభుత్వ నిబంధనలు పాటించి సన్నరకం ధాన్యంపై 500 రూపాయలు బోనస్ పొందేలా చర్యలు తీసుకోవాలి*
--- *రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, DCMS చైర్మన్ కొత్వాల*

రైతులు తాము పండించిన ధాన్యాన్ని ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి, సన్నరకం ధాన్యంపై 500 రూపాయలు బోనస్ పొందేలా చర్యలు తీసుకోవాలని *పాల్వంచ సొసైటీ అధ్యక్షులు, DCMS చైర్మన్, రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు* అన్నారు.

*పాల్వంచ కోఆపరేటివ్ సొసైటీ కార్యాలయంలో* బుధవారం *పాలకవర్గం సభ్యులు, వ్యవసాయ శాఖా, రెవెన్యూ, పౌరసరఫరాల శాఖా అధికారులతో అవగాహనా సమావేశం* నిర్వహించారు.

ఈ సందర్భంగా *కొత్వాల* మాట్లాడుతూ రైతులకు *ప్రభుత్వం సన్నరకం ధాన్యానికి 500 రూపాయలు బోనస్* ఇస్తున్నదని, బోనస్ పొందాలంటే రైతులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలన్నారు. అన్ని శాఖల అధికారులు మేలైన ధాన్యానికి పొందుపరిచిన ప్రభుత్వ నిబంధనలను రైతులకు వివరించాలన్నారు. పాల్వంచ సొసైటీ ద్వారా రైతులకు *మండలంలోని ప్రభాత్ నగర్ (రెడ్డిగూడెం), కరిగేట్టు, సోములగూడెం, సంగం, మున్సిపాలిటీ పరిధిలోని పెటచెరువు లలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేశామని, మండలంలోని రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే* ధాన్యాన్ని అమ్మి, సద్వినియోగం చేసుకోవాలని *కొత్వాల* కోరారు.

ఈ కార్యక్రమంలో *సొసైటీ వైస్ చైర్మన్ కాంపెల్లి కనకేష్, సహాయ పౌరసరఫరాల అధికారి R వర్దరాజు, వ్యవసాయ శాఖాధికారి P శంభో శంకర్, డిప్యూటీ తహసీల్దార్ S శ్రీనివాసులు, సొసైటీ డైరెక్టర్లు బుడగం రామ మోహన్ రావు, కనగాల నారాయణరావు, చౌగాని పాపారావు, సామా జనార్దన్ రెడ్డి, జరబన సీతారాంబాబు, యర్రంశెట్టి మధుసూదన్ రావు, మైనేని వెంకటేశ్వరరావు, నిమ్మల సువర్ణ, భూక్యా కిషన్, వ్యవసాయ శాఖా AEO లు అనురిక, సుజాత, శాంతి, సొసైటీ CEO G లక్ష్మీనారాయణ, కొనుగోలు కేంద్రాల ఇంచార్జులు*, తదితరులు పాల్గొన్నారు.

88
1929 views