logo

**రైల్వే రిటైర్డ్ ఉద్యోగులకు తిరిగి ఉద్యోగాల?

ప్రమాదకరమైన స్థాయిలో నిరుద్యోగం ఉంటే రైల్వేలో రిటైర్డ్ ఉద్యోగులను కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకుంటారా-డివైఎఫ్ఐ*

రైల్వే రిటైర్డ్ ఉద్యోగులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయడానికి ఉపసంహరించుకోవాలి, ఖాళీగా ఉన్న 2.98 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేయాలి-డివైఎఫ్ఐ*
రైల్వేలో రిటైర్డ్ ఉద్యోగులను కాంట్రాక్ట్ పద్ధతి పనిచేసుకునే ఆలోచనను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతూ జమ్మలమడుగు లో రైల్వే స్టేషన్ మేనేజర్ వివేకానంద రెడ్డి గారికి డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డివైఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు ప్రసాద్ మాట్లాడుతూ భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడా లేనంత యువశక్తి ఉన్నప్పటికీ ఉపాధి కల్పనలో బిజెపి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 9.8 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేసి యువతకు ఉపాధిని దూరం చేస్తుంది. ఫలితంగా భారతదేశాన్ని నిరుద్యోగ భారతంగా మారుస్తుంది. భారత రైల్వేలో ఇప్పటికే బాగా లాభాలు వచ్చే రైల్వే లైన్లను, రైల్వే స్టేషన్లను పార్సిల్ క్యాటరింగ్ లాంటి వాటిని ప్రైవేటు వారికి అప్పజెప్పడం వల్ల సామాన్య మధ్య తరగతి ప్రజానీకానికి సర్వీస్ చాలా ఖరీదుగా మారింది మరోవైపు యువతకు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు తగ్గిపోయాయి. భారతదేశంలోనే అతిపెద్ద ఉపాధి కల్పన కేంద్రంగా ఉండి రోజు కోట్లాదిమందిని తమ గమ్యస్థానాలకు చేర్చే భారత రైల్వేలో 2023 జూన్ 1 నాటికి 2,61,233 పోస్టులు అందులో కేవలం సేఫ్టీ కేటగిరీలో 53,178 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ రాజ్యసభలో లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం అవి 2.89 లక్షలు ఖాళీగా ఉన్నట్లు సమాచారం అందుతుంది. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగులను విధుల్లోకి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. దీన్ని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (DYFI) తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఈ చర్యలు నిరుద్యోగ యువతని మోసం చేయడమే అని తెలిపింది. తక్షణమే రిటైర్డ్ ఉద్యోగులను విధుల్లోకి తీసుకునే ఆలోచనను వెనక్కి తీసుకొని రైల్వేలో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటికీ నోటిఫికేషన్లు విడుదల చేయాలని, సాధారణ ప్రజలకు రోజువారీగా సాధారణంగా వచ్చే జబ్బుల మందులపై విపరీతంగా రేట్లు పెంచుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగువాల్సి వస్తుందని హెచ్చరించారు. డివైఎఫ్ఐ పట్టణ నాయకులు సురేంద్ర,నరసింహ,బాబు,నాగేంద్ర పాల్గొన్నారు.

0
0 views