వశీకరణ పేరుతో ప్రజలకు ప్రాణహాని తలపెడుతున్న మరుగుమందు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.
- తూములూరి శ్రీ కుమార్
ఎదుట వ్యక్తి తమకు బానిస కావాలనీ, తమ చెప్పుచేతలలో ఉండాలీ అనే మూర్ఖపు దురాలోచనను ప్రజలలో సృష్టించే విధంగా ఈ మరుగుమందు తయారుచేసి విక్రయిస్తూ అసాంఘిక చర్యలకు పాల్పడుతున్నారు.
ఈ మరుగుమందు వలన ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయో ఎంతవరకు ప్రాణహాని ఉందో అన్న ఇంగితజ్ఞానం కూడా లేకుండా వశీకరణ పేరుతో విచ్చలవిడిగా సోషల్ మీడియా వేదికగా ప్రకటనలు చేస్తూ మరుగుమందును విక్రయిస్తున్నారు.
ప్రభుత్వం తక్షణమే ఈ మరుగుమందు విక్రయాన్ని మాదకద్రవ్యాల విక్రయ చట్టంకింద పరిగణించి వెంటనే నిషేధించాలి .
అలాగే మరుగుమందుని విక్రయించేవారిపై మరియు కొనేవారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలి.
-తూములూరి శ్రీ కుమార్
హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు.