ప్రెస్ నోట్*
ఫుడ్ పాయిజన్ ఘటనపై రాజకీయాలు తగదు
మెరుగైన చికిత్స అందిస్తున్నాం
ప్రభుత్వాన్ని ఆడిపోసుకోవడం ఆపాలి
బీఆర్ఎస్ హాయంలో వందలాది కేసులు
సిరిసిల్ల నుంచి సిద్దిపేట దాకా వేలాది మంది విద్యార్దులకు అస్వస్థత
హైకోర్టు విచారణ చేసేంత స్థాయిలో ఫుడ్ పాయిజన్ కేసులు నమోదు
అప్పుడు ఒక్కరిని కూడా సందర్శించని బీఆర్ఎస్ నేతలు
హరీష్ రావు ఆరోపణలను ఖండించిన మంత్రి సీతక్క
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాలలో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనపై రాజకీయాలు చేయడం మానుకోవాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది, మహిళా శిశు సంక్షేమ, ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క హితవు పలికారు. ఫుడ్ పాయిజన్ తో అనారోగ్యబారిన పడిన విద్యార్ధులను ప్రభుత్వం పట్టించుకోలేదన్న మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలను ఖండించారు. ఫుడ్ పాయిజన్ ఘటన జరిగిన వెంటనే.. తమ ప్రభుత్వం తక్షణం స్పందించిందని మంత్రి సీతక్క తెలిపారు. బాధితులకు మెరుగైన వైద్యం ప్రభుత్వం అందించిందని మంత్రి సీతక్క గుర్తు చేసారు. తానే స్వయంగా ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేష్ దోత్రే, ఐటీడీఓ పీవో ఖుష్బూ గుప్తా లతో సమన్వయం చేసుకుంటూ విద్యార్దులకు ఏలాంటి అపాయం జరక్కుండా తగు చర్యలు చేపట్టినట్లు మంత్రి సీతక్క పేర్కొన్నారు. ఈ మేరకు మహరాష్ట్ర పర్యటనలో ఉన్నసీతక్క పత్రిక ప్రకటన విడుదల చేసారు. ఇలాంటి ఘటనలు జరక్కుండా హెల్త్ మానిటరింగ్ యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు.
ఘటన జరిగిన క్షణం నుంచి ఐటీడీఓ పీవో ఖుష్బూ గుప్తా దగ్గరుండి మరీ విద్యార్ధులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు చేపట్టారని తెలిపారు. నిమ్స్ లో చికిత్స పొందుతున్న విద్యార్దుల ఆరోగ్య పరిస్థితిని నిమ్స్ సూపరిండెంట్ సత్యనారాయణ, డాక్టర్లతో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు మానిటర్ చేసినట్లు సీతక్క తెలిపారు. స్వయంగా సీఎం గారి కార్యాలయం సైతం నిరంతం విద్యార్ధుల యోగక్షేమాలను తెలుసుకుంటూనే ఉందని...మంచిర్యాల మాక్స్ క్యూర్ ఆసుపత్రిలో చికిత్స్ అందించి..మరింత మెరుగైన వైద్యం కోసం నిమ్స్ ను తరలించినట్లు తెలిపారు. విద్యార్దినుల వైద్య ఖర్చులతో పాటు రహదారి ఖర్చులు పూర్తిగా ప్రభుత్వమే భరించినట్లు మంత్రి సీతక్క పేర్కొన్నారు. ఇప్పటికే రూ. 5 లక్షల మేర బిల్లులను చెల్లించినట్లు చెప్పారు. వైద్య ఖర్చులు మొత్తం ప్రభుత్వమే భరిస్తున్నట్లు తెలిపారు. తన వంతు భాద్యతగా స్థానిక ఎమ్మెల్యే కోవా లక్ష్మీ గారు బాధితులకు ఆర్ధిక సహయం చేసి ఉండవచ్చన్నారు.
సోమవారం నాడు నిమ్స్ లో చికిత్స పొందుతున్న విద్యార్ధులను విసిట్ చేయాలని తాను భావించినా..విద్యార్ధులు ఐసీయూలో చికిత్స పొందుతున్నందున చూడటానికి వీలు కాలేదని తెలిపారు. నిమ్స్ సూపరిండెంట్ సత్యనారాయణ తో సోమవారం మద్యాహ్నం తాను ఫోన్లో మాట్లాడి నిమ్స్ కు వస్తున్నట్లు ముందస్తు సమాచారం అందిస్తే..విద్యార్దినులు ఐసీయూలో చికిత్స పొందుతున్నందున....ఐసీయూలోకి వెల్లడం వల్ల ఇన్ఫెక్షన్ సోకుతుందని..అందుకే సందర్శన మరో రోజుకు వాయిదా వేసుకోవాలని సూపరిండెంట్ సత్యనారాయణ విజ్నప్తి చేసినట్లు మంత్రి సీతక్క తెలిపారు. విద్యార్ధులు కోలుకుంటున్నారని...ఏలాంటి ఆందోళన అవసరం లేదని డాక్టర్లు చెప్పడంతో...సందర్శనను వాయిదా వేసుకున్నట్లు సీతక్క తెలిపారు. అధికారులు విద్యార్దినుల ఆరోగ్యాన్ని, అందుతున్న చికిత్సను పర్యవేక్షిస్తూనే ఉన్నారని పేర్కొన్నారు.
స్టుడెంట్స్ కి మెరుగైన వైద్యం అందేలా తమ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నా ఫుడ్ పాయిజన్ ఘటనపై హరీష్ రావు రాజకీయాలు చేయడం సరికాదన్నారు. తమ ప్రభుత్వం, తాను నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు ఏలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నామని మంత్రి సీతక్క తెలిపారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రమాధాలుజరిగినా ప్రజలకు పరమార్శించి భరోసా కల్పించని బీఆర్ఎస్ పెద్దలు, అధికారం కోల్పోగానే ప్రజలపై ప్రేమ కురిపిస్తున్నారని మండి పడ్డారు.
బీఆర్ఎస్ హయంలో వందల పుడ్ పాయిజన్ ఘటనలు జరిగి వేలాది మంది విద్యార్ధులు అనారోగ్యం పాలైనా బీఆర్ఎస్ పట్టించుకోలేదని మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేసారు. గురుకులాల్లో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనపై ఏకంగా హైకోర్టు విచారణ జరిపిందని సీతక్క గుర్తు చేసారు. గత ప్రభుత్వ హయంలో సిరిసిల్ల నుంచి సిద్దిపేట దాకా జరిగిన పలు ఫుడ్ పాయిజన్ కేసుల వివరాలను సీతక్క విడుదల చేసారు. ఫుడ్ పాయిజన్ ఘటనలపై రాజకీయాలు చేసి పిల్లలను, పేరెంట్స్ ను భయ బ్రాంతులకు గురి చేయోద్దని మంత్రి సీతక్క విపక్షాలకు హితవు పలికారు.