logo

పత్రిక ప్రకటన తేది :05 11.2024 అదిలాబాద్ జిల్లా బుధవారం శాసన మండలి ఓటరుగా నమోదు చేసుకోవాలి: గూగుల్ మీట్ ద్వారా సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించిన జిల్లా పాలనాధికారి రాజర్షి షా.


మెదక్, నిజామాబాద్, అదిలాబాద్,కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గం , ఎలాక్ట్రోరోల్ రోల్స్ నవంబర్ 1వ తేది 2024 గా అర్హత తేదీగా సూచిస్తూ ఎలెక్టోరల్ రోల్స్ డి నొవో (తాజా ఓటర్ల జాబితా తయారీ)

తెలంగాణా లోని మెదక్, నిజామాబాద్, అదిలాబాద్, కరీంనగర్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నకు సంబందించి తాజా ఓటర్ల నమోదు ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు.

ఇంతకు ముందు ఓటరుగా నమోదు చేసుకున్న వారు కూడా పట్ట భద్రుల నియోజక వర్గంలో తిరిగి మరల ఓటర్లుగా నమోదు చేసుకోవాలన్నారు.
నియోజక వర్గ పరిధిలో కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల , మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, నిజామాబాద్, , కామారెడ్డి, అదిలాబాద్, నిర్మల్, కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలు.
.ఫార -18 లో తేది:30.09.2024 న దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించడం జరిగింది.
నవంబర్ 23 న ఓటర్ల జాబితా ముసాయిదా ప్రచురణ,
క్లెయిమ్ లు,ఫారం 18 లో అభ్యంతరాలు నవంబర్ 23 నుండి డిసెంబర్ 09 వరకు
ఓటర్ల జాబితా తుది ప్రచురణ 30.12.2024

అర్హత
నవంబర్ 01 , 2024 కంటే కనీసం 3 సంవత్సరాల ముందు డిగ్రీ /, తత్సమాన మైన డిప్లొమా పూర్తి చేసి ఉండాలి,
ఏదైనా విశ్వ విద్యాలయం నుండి డిగ్రీ లేదా సూచించిన విధంగా సమానమైన అర్హత కలిగి ఉండాలి
పట్టభద్రుల నియోజకవర్గం ప్రాంతం లో సాధారణ నివాసిగా ఉండాలి
సంబంధిత విశ్వవిద్యాలయం లేదా సంస్థ జారీ చేసిన ఒరిజనల్ డిగ్రీ, డిప్లొమా సర్టిఫికెట్ లేదా దాని నకలు సంబంధిత జిల్లాలోని డిజిగ్నేటెడ్ ఆఫీసర్, అడిషనల్ డిజిగ్నెటెడ్ ఆఫీసర్, గెజిటెడ్ ఆఫీసర్ ల చేత ప్రామాణికరించబడి ఉండాలి.
ప్రభుత్వ రికార్డులో నమోదు నకలు లేదా గ్రాడ్యూయెట్, ప్రభుత్వ ఉద్యోగికి hod/గెజిటెడ్ హెడ్ ఆఫ్ ఆఫీసర్, ఇన్స్టిట్యూట్ జారీ చేసిన సర్టిఫికెట్ , ప్రభుత్వ
రికార్డులలోని నమోదుల ఆధారంగా లేదా చట్టబద్ధమైన సంస్థల రికార్డులో నమోదు చేసిన నకలు కార్పొరేషన్లు, పబ్లిక్ అండర్ టేకింగ్ లో నమోదు చేయబడి ఉన్న డిగ్రీ డిప్లొమా లేదా సర్టిఫికెట్ ను సంబంధిత కార్యాలయ అధిపతి చేత దృవీకరనిచబడినవి లేదా యూనివర్శిటీ జారీ చేసిన రిజిస్ట్రార్ గ్రాడ్యుయేట్ గా నమోదు చేసిన కార్దు యొక్క దృవీకరించబడిన కాపీ న్యాయవాదుల రోల్ లో మెడికల్ ప్రాక్టిసనర్ల రిజిష్టర్ ఛార్టర్డ్ అకౌంటెంట్ ల రిజిష్టర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్ ద్వారా నిర్వహించబడే ఇంజనీర్ల రిజిష్టర్ మొదలైన వాటిలో డ్రువీకరించబడిన నమోదు యొక్క నకలు లేదా యూనివర్శిటీ రిజిస్ట్రార్ లేదా యూనివర్శిటీ అనుభందంగా ఉన్న కాలేజి ప్రిన్సిపాల్ లేదా అతను చదివిన కాలేజి డిపార్ట్మెంట్ హెడ్ నుండి సర్టిఫికెట్ అని తెలియజెప్పే అఫిడవిట్ లేదా మార్క్ షీట్, సంబంధిత విశ్వవిద్యాలయం లేదా సంస్థ ద్వారా జారీ చేయబడిన లేదా దాని నకలు సంబంధిత జిల్లాకు చెందిన డిజిగ్నేటేడ్/ అడిషనల్ డిజిగ్నెటడ్ ఆఫీసర్, గెజిటెడ్ ఆఫీసర్, పబ్లిక్ నోటరీ ద్వారా ప్రామాణీక రించబడింది./ ఆధార్ సంబంధిత పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించినట్లు స్పష్టమైంది.

ఆఫ్ లైన్ ఎన్ రోల్ మెంట్
దరఖాస్తులు ఫారం 18 లో ఎలక్ట్రోరోల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ & జిల్లా రెవెన్యు అధికారి %కలెక్టరేట్ కరీంనగర్ / నొటిఫెయిడ్ అసిస్టెంట్ ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ లు, మెదక్, నిజామాబాద్, అదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గం లో డిసిగ్నేటెడ్ ఆఫీసర్ల వద్ద స్వీకరించబడతాయి.

ఆన్ లైన్ నమోదు
దరఖాస్తులు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ ఆన్ లైన్ వెబ్సైట్
https:/ceotelangana.nic.in/ ద్వారా స్వీకరణ ఉంటుంది.

ఏదైనా స్పష్టికరణలు మరియు సందేహాల కోసం దయచేసి పట్టభద్రుల నియోజకవర్గం ఎలక్ట్రొరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ అండ్ జిల్లా రెవెన్యు అధికారి,%కలెక్టరేట్ కరీంనగర్/నోటిఫెయ్డ్ అసిస్టెంట్ ఎలక్ట్రొరోల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ మరియు రాష్ట్ర కాల్ సెంటర్ ద్వారా క్రింది నెంబర్లకి ఫోన్ చేసి సమాచారం పొందవచ్చును.
అన్ని పనిదినాలలో ఉదయం 10.30 నుండి సాయంత్రం 5.00 గంటల వరకు


1950
టోల్ ఫ్రీ నెంబర్ 18004254731
జిల్లా కంట్రోల్ రూం నెంబర్ 08782997247.

0
29 views