మృతి చెందిన పోలీసు కుటుంబానికి చేయూత అందజేత
- విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్
🌀 *మరణించిన ఎస్ఐ కుటుంబానికి 'చేయూత'ను అందజేసిన జిల్లా ఎస్పీ*
విజయనగరం జిల్లా పోలీసుశాఖలో పని చేసి, ఇటీవల అనారోగ్య కారణాలతో మృతి చెందిన ఎస్ఐ కుటుంబానికి “చేయూత”ను అందించేందుకు పోలీసు సిబ్బంది ప్రోగు చేసిన మొత్తాన్ని జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్, ఐపిఎస్ గారు నవంబరు 5న జిల్లా పోలీసు కార్యాలయంలో అందజేసారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ మాట్లాడుతూ - పోలీసుశాఖలో పని చేస్తూ ప్రమాదవసాత్తు లేదా ఆకస్మికంగా లేదా అనారోగ్యంతో మరణించిన పోలీసు కుటుంబాలు అర్ధంతరంగా తమ కుటుంబ యజమానిని కోల్పోయి, ఆర్ధికంగా నష్టపోయిన సమయంలో వారికి ప్రభుత్వం నుండి బెనిఫిట్స్ అందేంత వరకు వారి కుటుంబాలను ఆర్ధికంగా ఆదుకొనేందుకు పోలీసుశాఖకు చెందిన ఉద్యోగులు స్వచ్చందంగా ముందుకు వచ్చి, కొంత మొత్తాన్ని ప్రోగు చేసి, వారి కుటుంబాలకు “చేయూత”గా అందజేయడం అభినందనీయమన్నారు. ఈ తరహా చర్యలు చేపట్టడం వలన పోలీసు ఉద్యోగుల్లో ఐకమత్యం పెరగడంతోపాటు, వారి కుటుంబాలకు అండగా ఉన్నామన్న భరోసా లభిస్తుందని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ అన్నారు.
జిల్లా పోలీసుశాఖలో కొత్తవలస పోలీసు స్టేషనులో ఎస్ఐగా పని చేసిన కే.వెంకటేశ్వర్లు అనారోగ్య కారణాలతో ఇటీవల మరణించగా, వారి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకొనేందుకు 'చేయూత'గా పోలీసు సిబ్బంది ప్రోగు చేసిన రూ. 1,48,400/- ల చెక్ ను వారి సతీమణి శ్రీమతి కే.బంగారమ్మకు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్, ఐపిఎస్ గారు జిల్లా పోలీసు కార్యాలయంలో అందజేసారు.
ఈ కార్యక్రమంలో డిపిఓ ఎఓ పి.శ్రీనివాసరావు, ఆఫీసు సూపరింటెండెంట్ ఎ.ఎస్.వి.ప్రభాకర
రావు మరియు పోలీసు కుటుంబ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.