సింగిల్ విండో ద్వారా రాజకీయ పార్టీలకు అనుమతులు
విజయనగరం జిల్లాలో జరగనున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి రాజకీయ పార్టీల అభ్యర్థులకు సింగిల్ విండో ద్వారా అవసరమైన అనుమతులు మంజూరు చేయనున్నట్టు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి అంబేడ్కర్ వెల్లడించారు. ఈ సింగిల్ విండో సెల్‌కు నోడల్ అధికారిగా ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ ఎల్.జోసెఫ్ వ్యవహరిస్తారని, బహిరంగ సభలు, ర్యాలీలు, ప్రదర్శనల నిర్వహణకు అనుమతులు ఆయనే ఇస్తారని చెప్పారు.