logo

నంద్యాల జిల్లా: రజకులకు నానినేటెడ్ పదవులను కేటాయించాలి: రజక ఎస్సీ సాధన చైతన్య సమితి వ్యవస్థాపకులు నందవరం శ్రీనివాసులు రజక.

నంద్యాల జిల్లా :
ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని విజ్ఞప్తి.
రాష్ర్టంలోని 26 జిల్లాలలో రజక వెల్ఫేర్ అండ్ మానిటరింగ్ కమిటీలను ఏర్పాటు చేయాలి.
తెలుగుదేశం పార్టీని నమ్ముకొని గెలుపు కోసం కృషి చేసిన రజక సామాజిక వర్గానికి చెందిన నాయకులకు రాష్ట్ర, జిల్లా స్థాయిలో నామినేటెడ్ పదవులను కేటాయించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం కొణిదేల పవన్ కళ్యాణ్, ఐటి విధ్యా శాఖ మంత్రి నారా లోకేష్ బాబు లను ఏపి రజక ఎస్సీ సాధన చైతన్య సమితి వ్యవస్థాపకులు నందవరం శ్రీనివాసులు రజక మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలో రజక సామాజిక వర్గం ఎన్నికలు ఎప్పుడు వచ్చినా,వారి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ టీడీపీ పార్టీకి అండగానిలుస్తూ, పార్టీ విజయం కోసం అహర్నిషలు కృషి చేశారని తెలిపారు. గత ఐదేళ్ల కాలంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మా బీసీలు,మా ఎస్సీలు అంటూనే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ పదవులను కేటాయించ కుండా , కనీసం నామినేటెడ్ పదవులను కేటాయించాకుండా మోసం చేశారని విమర్శించారు. అదేవిధంగా జీఓ నెంబర్ 343 ప్రకారంగా దోభీఘాట్ల నిర్మాణం కోసం నిధులను కేటాయించాలని,ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రభుత్వ కార్యాలయాల్లో ధోభి కాంట్రాక్టులు రజకులకే ఇవ్వాలని, జీఓ నెంబర్ 27 ప్రకారం దేవాదాయ శాఖ,ప్రభుత్వ సంస్థలలో రజకులకు పదవులు ఇవ్వాలని కోరారు. కేంద్ర పాలిత 18 రాష్ట్రాలలో రజకులు ఎస్సీ, ఎస్టీ లుగా ఉన్నారని, కేవలం తెలుగు రాష్ట్రాలలో మాత్రమే బీసీలుగా కొనసాగుతుండడం బాధాకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు రజకులను ఎస్సీ జాబితాలో చేర్చేందుకు,కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తామని, అంతవరకు రజకులకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. 2004 సంలో చంద్రబాబు నాయుడు సీఎం గా ఉన్న సమయంలో జీ ఓ నెంబర్ 06 ప్రకారం రజక వెల్ఫేర్ అండ్ మానిటరింగ్ కమిటీలను వెంటనే అమలు చేయాలని కోరారు.అలాగే తెలుగుదేశం పార్టీ విజయం కోసం కృషి చేసిన సీనియర్ నాయకులకు రాష్ట్ర, జిల్లా స్థాయిలో నామినేటెడ్ పదవులను కేటాయించాలని ఆయన కోరారు.

0
0 views