logo

భవిష్యత్తు మీది, 2047 నాటికి దేశాన్ని మీరే నడిపించాలి..! డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ గురుకులాన్ని సందర్శించిన ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

సోమవారం మధ్యాహ్నం కాకినాడ రూరల్ పరిధిలోని పి.వెంకటాపురం గ్రామంలోని డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ గురుకులాన్ని సందర్శించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురుకులం అభివృద్ధి పనుల నిమిత్తం రూ. 20 లక్షలు మంజూరు చేస్తూ 15 రోజుల్లో గురుకులంలో ఎంసెట్ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేయిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ కొన్ని ముఖ్యమైన సూచనలు చేశారు:

🔸చదువుతో పాటు బాలికలు వ్యక్తిగత భద్రతపై కూడా దృష్టి సారించాలి

ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థినుల భద్రత ఎంతో ముఖ్యం. స్వీయ భద్రత నైపుణ్యాలను కూడా విద్యార్థినులు తెలుసుకోవాలి. అకతాయిల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడ, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తక్షణం అధ్యాపకులు, తల్లిదండ్రులతో పాటు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలి.

🔸పర్యావరణాన్ని కాపాడే బాధ్యతను విద్యార్ధులు భుజాన వేసుకోవాలి

పర్యావరణం విషయంలో పెద్దవారు తప్పులు చేస్తుంటే సరిచేయండి. చెరువులు కలుషితం చేస్తుంటే ఇది మా భవిష్యత్తు, చేయకండి అని తేల్చి చెప్పండి. గోదావరి జిల్లాల్లో చుట్టూ నీరు పారుతున్నా తాగేందుకు మంచి నీరు లేదు. అభివృద్దితో పాటు పర్యావరణ ప్రాధాన్యతను గుర్తించాలి.

🔸భవిష్యత్తు మీది.. 2047 నాటికి దేశాన్ని మీరే నడిపించాలి

గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పినట్లు - భవిష్యత్తు మీది. 2047 నాటికి దేశాన్ని మీరే నడిపించాలి. మీరంతా అద్భుత ప్రగతి సాధించాలి. గొప్ప శాస్త్రవేత్తలు కావాలి. లియోనార్డి డావెన్సీలా వివిధ అంశాలపై అవగాహన పెంచుకోండి. మనిషి శక్తి అనంతం. ఆ శక్తిని గుర్తించండి. సెల్ఫ్ డిఫెన్స్ చాలా అవసరం. విజువల్ థింకింగ్, మైండ్ మ్యాపింగ్, డూడ్లింగ్ పై అధ్యాపకులు కూడా దృష్టి సారించాలి. విద్యార్థినులు నాలుగు గోడలకు పరిమితం కావద్దు. మార్షల్ ఆర్ట్స్, యోగా వంటి విద్యలు అభ్యసించాలని సూచించారు.

3
1149 views