logo

విశాలాంధ్ర సంచార పుస్తకాలయం ప్రారంభించిన సీఐ అశోక్ కుమార్

విజయనగరం జిల్లా. రాజాం.

రాజాం పట్టణ ప్రధాన రహదారిలో విశాలాంధ్ర సంచార పుస్తకాలయాన్ని రాజాం పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ కె.అశోక్ కుమార్ ప్రారంభించారు. సిఐ మాట్లాడుతూ పుస్తక పఠనం మేధాశక్తిని పెంచుతుందని ప్రతి ఒక్కరు పుస్తక పఠనం అలవర్చుకోవాలని విశాలాంధ్ర సంచార పుస్తకాలయాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని ఆయన కోరారు. నిర్వాహకులు మాట్లాడుతూ ఈ పుస్తకాలయంలో జనరల్ నాలెడ్జ్,శాస్త్ర, తెలుగు సాహిత్యం, విశాలాంధ్ర సాహిత్యం, కమ్యూనిస్టు మార్చిజం, తెలుగు నవలలు, ముళ్ళపూడి వెంకటరమణ సాహిత్యం, వాసిరెడ్డి సీతాదేవి సాహిత్యం, దాశరధి సాహిత్యం, అడవి బాపిరాజు, శరత్ సాహిత్యం, రంగనాయకమ్మ సాహిత్యం, తెలుగు స్టోరీస్, వంశీ సాహిత్యం, యండమూరి రవీంద్రనాథ్ నవలలు, యుద్ధనపూడి నవలలు, గీతా ప్రెస్, చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలు, ఆధ్యాత్మిక బుక్స్, తెలుగు వ్యాకరణం, స్పోకెన్ ఇంగ్లీష్ గ్రామర్, కలరింగ్ బుక్స్, సైన్స్ ఇంగ్లీష్ బుక్స్, హెల్త్ బుక్స్, ఆయుర్వేదం, పర్సనాలిటీ డెవలప్మెంట్ పుస్తకాలను అందుబాటులో ఉన్న విశాలాంధ్ర సంచార పుస్తకాలయం ( వ్యాన్) ను మంగళవారం మెయిన్ రోడ్ పోలీస్ క్వార్టర్స్ నందు,బుధవారం నాడు రాజాం పాలకొండ రోడ్ లో ఏర్పాటు చేయడం జరుగును కావున రాజాం పట్టణ పరిసర ప్రాంతా వాసులు, మేధావులు, కవులు,విద్యార్థిని విద్యార్థులు తదితరులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోగలరని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ వై.రవికిరణ్, రాజాం విశాలాంధ్ర పాత్రికేయులు దేవిరెడ్డి రామారావు, సీనియర్ పాత్రికేయులు భీంపల్లి తిరుపతిరావు, ఉల్లాకుల నీలకంఠ యాదవ్, పాలపర్తి గణేష్, ముతికి కిషోర్, మండాది శ్రీధర్, ఉరిటి జగదీశ్వరరావు, మజ్జి సంఘంనాయుడు, శ్రీ విద్యానికేతన్ కరస్పాండెంట్ గట్టి పాపారావు, జ్ఞాన జ్యోతి స్కూల్ కరస్పాండెంట్ నడికుప్పల తారకేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

45
1588 views