logo

ఉచిత మెడికల్ క్యాంపు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. డాక్టర్ కె.వి సాయి ప్రసాద్. స్వేచ్ఛ, ప్రజా ఆరోగ్య వేదిక.

స్వేచ్ఛ , ప్రజా ఆరోగ్య వేదిక ల ఆధ్వర్యంలో ఫ్రీ మెడికల్ క్యాంప్ నిర్వహణ

మొఘల్ రాజ పురం , బందిల దొడ్డి సెంటర్ లో నేడు స్వేచ్ఛ, ప్రజా ఆరోగ్య వేదిక ల ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించారు.

ఈ సంధర్భంగా మెడికల్ క్యాంపు నందు పిల్లల ,పెద్దల జబ్బులకు సంభందించి రోగులను వైద్యులు పరీక్షించి మందులను అందించారు. వైద్య సూచనలు చేసారు. వందమందికి పైగా రోగులు క్యాంప్ నందు సేవలను పొందారు.

ఈ సందర్భంగా ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు మరియు ప్రజా ఆరోగ్య వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షులు డాక్టర్ కె. వి. సాయి ప్రసాద్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. పరిశుభ్రమైన పౌష్టికాహారం, స్వచ్చమైన మంచినీళ్ళు , వ్యక్తిగత పరిశుభ్రత ద్వారా వ్యాధులు రాకుండా నివారించ వచ్చని అన్నారు. అనంతరం చిన్నారులతో , రోగులతో ముచ్చటించారు. వారి సందేహాలను నివృత్తి చేసారు.

ఇంకా ఈ క్యాంప్ లో జనరల్ సర్జన్ డాక్టర్ బి. శ్రీ హర్ష, వైద్యులు డాక్టర్ కీర్తి, డాక్టర్ వి. సుమ నిత్య, డాక్టర్ కె.పద్మావతి, డాక్టర్ బి. సంపత్ మరియు వైద్య విద్యార్థులు ప్రేమ్ చంద్, ఎస్ .కే ఆశియా, సుజిత, హష్మీ వైద్య సేవలు అందించారు.

స్వేచ్ఛ స్టేట్ కో ఆర్డినేటర్ శ్రీపతిరాయ్, నిహారిక, జాన్, తేజ, ప్రజా ఆరోగ్య వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి జి. విజయ్ ప్రకాష్, బి. లీలా సుందరి, జి. శ్రీధర్ తదితరులు క్యాంప్ ను పర్యవేక్షించారు. స్థానిక పెద్దలు పాల్గోన్నారు.

19
1470 views