చారల పిల్లి పుస్తకం ఆచరణాత్మకం
చారల పిల్లి పుస్తకం ఆలోచనాత్మకం
పుస్తకావిష్కరణ సభలో వక్తలు
విశాలాంధ్ర -
విజయవాడ(చిట్టి నగర్):చారల పిల్లి పుస్తకం ఆలోచనాత్మకమని వక్తలు కొనియాడారు.
సూఫీ పబ్లికేషన్స్ అద్వర్యంలో కేంద్రసాహిత్య అకాడెమి యువపురస్కారగ్రహీత వేంపల్లె షరీఫ్ రచించిన చారల పిల్లి పుస్తకావిష్కరణ సభ కాట్రగడ్డ దయానంద్ అద్యక్షతన ఆదివారం బుక్ ఫెస్టివల్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కవి ఖాదర్ మొహియుద్దీన్ పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించారు.
అనంతరం జరిగిన సభలో వక్తలు మాట్లాడుతూ భారతదేశంలో ముస్లిం జీవితాలలోని విషధాలను హింస, వ్యసనాల ఉక్కపోతలను చాపక్రింద నీరులా రచయిత షరీఫ్ చారల పిల్లి పుస్తకంలో ప్రతిమభించారని, సాటి మనుషుల పట్ల ప్రేమతత్వం, పేద ముస్లింల ఔదార్యం, ఆత్మ విశ్వాసం, హిందూ, ముస్లింల సోదరభావం పొందుపర్చారని వక్తలు వ్యాఖ్యానించారు.
ముందుగా ప్రజాస్వామ్య రచయిత్రుల వేదిక రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ కె ఎన్ మల్లేశ్వరి చారల పిల్లి పుస్తకంలోని కొన్ని కథల సారాంశాన్ని తెలియచేసారు.
రచయితలు కాట్రగడ్డ దయానంద్, బత్తుల ప్రసాద్, అనిల్ డ్యానీ, ఛాయా పబ్లికేషన్స్ ఎడిటర్ అరుణాంక్ లత, సీతారాములు పాల్గొని రచయితను షరీఫ్ ను అభినందిస్తూ తమ సందేశాలనిచ్చారు.
ఈ కార్యక్రమంలో సాహితీ ప్రియులు, విద్యావేత్తలు, నగర ప్రముఖులు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు.