తనపై వస్తున్న మీడియాలో వస్తున్న పుకార్లు నమ్మకూడదంటూ సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ తెలిపారుT7telugu news
అందరికీ నమస్కారాలు 🙏🙏🙏🙏
నేను మీ బండారు శ్రావణి శ్రీ గత కొద్ది రోజులుగా నాకు తీవ్ర జ్వరం మరియు ఫ్లూ కారణంగా స్వల్ప అస్వస్థతకు గురైన కారణంగా వైద్యులు కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోమని సూచించారు.
నియోజకవర్గం ప్రజలకు,నాయకులకు,కార్యకర్తలకు,అధికారులకు ఫోన్ ద్వారా అందుబాటులో ఉన్నాను. అసత్య ప్రచారాలు నమ్మకండి. వీలైనంత త్వరగా నా ఆరోగ్యాన్ని కుదుటపరుచుకొని మీ అందరికీ అందుబాటులోకి వస్తానని తెలియజేస్తున్నాను. మన క్యాంపు కార్యాలయంలో ఎలాంటి కార్యక్రమాలు గాని సేవలకు గాని అంతరాయం ఉండదని తెలియజేస్తున్నాను.
మీ ప్రేమ,ఆశీస్సులతో నేను త్వరగా కోలుకోని రెండు రోజుల్లో తిరిగి మీ ముందుకు వస్తానని తెలియజేస్తున్నాను🙏🏻
మీ
బండారు శ్రావణి శ్రీ