logo

గిరిజన కాంట్రాక్టు ఉపాధ్యాయులకు టైం స్కేల్ ఇవ్వాలని పి.ఆర్.టి.యు వ్యవస్థాపక అధ్యక్షులు గాల్ రెడ్డి హర్ష వర్ధన్ రెడ్డికి వినతిపత్రం

ఖమ్మం జిల్లా, 29 ఆగష్టు: స్థానిక ఖమ్మం పట్టణంలో వరంగల్, నల్గొండ, ఖమ్మం ఎమ్మెల్సీ అభ్యర్థి హర్షవర్ధన్ రెడ్డి సన్నాహక సమావేశంలో గిరిజన ఆశ్రమ పాఠశాల కాంట్రాక్టు ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు అజ్మేర శివ నాయక్ ఆధ్వర్యంలో సుమారు 2000 సిఆర్టి గిరిజన కాంట్రాక్టు ఉపాధ్యాయులు గత 20 సంవత్సరాలుగా చాలీచాలని వేతనాలతో జీవిస్తున్నారు. గత ప్రభుత్వంలో ఆదివాసీ గిరిజనుల కాంట్రాక్టు ఉపాధ్యాయుల గోడును వినిపించలేకపోయింది. ఈ ప్రభుత్వంలోనైనా హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో గిరిజన ఆశ్రమ పాఠశాల కాంట్రాక్టు ఉపాధ్యాయులకు మినిమం టైం స్కేల్ మంజూరు చేపియాలని వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. త్వరలో జరగనున్న జిల్లాల ఎమ్మెల్సీ ఎలక్షన్లో గిరిజన ఆశ్రమ పాఠశాల కాంట్రాక్టు ఉపాధ్యాయులు ఓటు కీలకమైనది మా సమస్యను పరిష్కరించాలని కోరారు. మీ సమస్యపై ముఖ్యమంత్రి తో మాట్లాడి సుమారు 2000 మంది గిరిజన కాంట్రాక్టు ఉపాధ్యాయులకు మినిమం టైం స్కేల్ ఇప్పిస్తామని సభాముఖంగా హర్షవర్ధన్ రెడ్డి హామీ ఇచ్చారని అన్నారు. వారికి గిరిజన కాంట్రాక్టు ఉపాధ్యాయుల సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి ధారావత్ వీరన్న , ఖమ్మం జిల్లా ట్రెజరీ శ్రీను, ఖమ్మం జిల్లా అధ్యక్షులు భాస్కర్ నాయక్, జిల్లా ఉపాధ్యక్షులు నెహ్రూ నాయక్, తదితరులు పాల్గొన్నారు.

11
3739 views