logo

క్రికెట్‌ వారసులు వీరేనా?

ఓపెనర్‌గా ఎవరంటే..


రోహిత్‌ రిటైర్‌ అయితే..యశస్వీ జైస్వాల్‌కు తోడుగా ఇన్నింగ్స్‌ను ఎవరు ఆరంభిస్తారనేది మరో చర్చ. అభిమన్యు ఈశ్వరన్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, సాయి సుదర్శన్‌ రేసులో ఉన్నారు. 27 ఫస్ట్‌క్లాస్‌ సెంచరీలతో ఈశ్వరన్‌ ముందంజలో ఉన్నాడు. కానీ పెద్ద మ్యాచ్‌ల్లో ఒత్తిడిని తట్టుకోలేడనే అపప్రధ ఈశ్వరన్‌పై ఉంది. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ధనాధన్‌ బ్యాటింగ్‌ చేసే రుతురాజ్‌ శైలి టెస్ట్‌ క్రికెట్‌కు నప్పుతుందా అనేది ప్రశ్న. దాంతో ఎక్కువసేపు క్రీజులో నిలవడంతోపాటు చక్కటి టెక్నిక్‌ కలిగిన సాయి సుదర్శన్‌ ఉత్తమం. ఓపెనర్‌గానే కాదు నెంబర్‌ 3లోనూ బ్యాటింగ్‌ చేయగల సమర్థుడు సుదర్శన్‌. తదుపరి స్థానం విరాట్‌ కోహ్లీది. టెస్ట్‌ అరంగేట్రంలోనే అర్ధ శతకం బాదిన దేవదత్‌ పడిక్కళ్‌..విరాట్‌ స్థానానికి చక్కగా సరిపోతాడు. బౌలింగ్‌తోపాటు బ్యాటింగ్‌లోనూ రాణించే అక్షర్‌ పటేల్‌.. ఆల్‌రౌండర్‌ జడేజాకు ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాడు. కానీ స్పిన్‌కు అనుకూలించని పిచ్‌లపై బౌలింగ్‌లో తేలిపోవడం అక్షర్‌కు మైనస్‌. పుణెలో 11 వికెట్లు తీయడంతోపాటు 2021 బ్రిస్బేన్‌ టెస్ట్‌లో బ్యాటింగ్‌తో భళా అనిపించిన వాషింగ్టన్‌ సుందర్‌..జడేజా-అశ్విన్‌ల వారసుడిగా భావిస్తున్నారు.

0
0 views