logo

చంద్రబాబు నివాసం దగ్గర భద్రతపై జీవో విడుదల

ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు భద్రతపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఏపీలోని చంద్రబాబు నివాసం దగ్గర భద్రత, ఇతర వసతుల కోసం నిధుల విడుదలకు జీవో జారీ అయింది. రూ.1.44కోట్లను ఏపీ ప్రభుత్వం వెచ్చిస్తుంది. రక్షణ కోసం సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటుకు రూ.21లక్షలు, నిఘా కోసం రూ.81లక్షలతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తుంది. సీఎం ఇంటికి వచ్చే వాహనాల తనిఖీలు, నియంత్రణ, యూవీఎస్‌ఎస్, హైడ్రాలిక్ బోలార్డ్స్ కోసం రూ.42లక్షలను ఏపీ ప్రభుత్వం కేటాయించింది.

0
0 views