
డాక్టర్ మెస్రం మనోహర్ విద్య వేత్త ఆదివాసీ సమాజ మేధావులు వారి సేవా సౌజన్యంతో
జిల్లా మెడి దుర్గు పటేల్ చేతుల మీదుగా
MBBS సీటు సాధించిన ఆదివాసి బిడ్డ మెస్రం సాయి శ్రద్ధకి 61000/- రూపాయల ఆర్థిక సహాయం.
..
జైనూరు మండలం జండగూడ గ్రామానికి చెందిన ఒక సాధారణ టైలర్ గా పని చేస్తున్న మెస్రం జ్ఞానేశ్వర్ లక్ష్మి దంపతుల కుమార్తె మెస్రం సాయి శ్రద్ధకి అభిమన్యు గ్రూపు సభ్యుల తరఫున 61000/- రూపాయల తన ట్యూషన్ ఫీజు కొరకు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఆదివాసి పర్దాన్ సమాజం నుండి ఒక నిరుపేద కుటుంబం నుండి కష్టపడి చదివి MBBS సీటు సాధించి యావత్ ఆదివాసి సమాజానికి ఆదర్శంగా నిలిచారు అని అభిమన్యు గ్రూపు సభ్యులు అభినందించారు. ఇలాగే మరింత ఉన్నతంగా చదివి ఆదివాసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడానికి డాక్టర్ గా నిరుపేదలకు సేవ చేయాలని సాయి శ్రద్ధని కోరారు. ఈ కార్యక్రమంలో
ఐటీడీఏ ఏపీవో PVTG డాక్టర్ మెస్రం మనోహర్ గారు, జిల్లా సార్ మేడి మెస్రం దదుర్గు పటేల్ గారు, ,తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షులు పుర్కా బాపురావు గారు, మెస్రం బాదు గారు, రాయి సెంటర్ సలహాదారులు మడవి ఆనందరావు గారు, పర్దాన్ సమాజ్ ఉద్యోగులు మరప గోవిందరావు గారు, శ్రీనివాస్ గారు,అభిమన్యు నిర్వాహకులు మెస్రం శేఖర్ బాబు, పెందుర్ దీపక్
పాల్గొన్నారు.
సహాయ దేవతలకు పాదాభివందనాలు💐💐💐💐
సదా
మీ సేవలో
అభిమన్యు గ్రూప్