Machilipatnam, Krishna District, Andhra Pradesh, India.
New Magician in Information & Public Relations department.
*కృష్ణ జిల్లా, మచిలీపట్నం, ఆంధ్రప్రదేశ్*
*సమాచార శాఖలో సరికొత్త మాయల పకీరు*
*ప్రభుత్వ ప్రచారం నిల్లు అక్రమాలే ఇక్కడ ఫుల్లు*
మచిలీపట్నం, మహిత ప్రతినిధి, అక్టోబర్ 26:
" తాంబూలం ఇచ్చేసాం.. తన్నుకు చావండి.." అన్న చందాన తిక్క చేష్టల తుగ్లక్ అధికారిని నెల్లూరు నుంచి తరిమేస్తే ప్రశాంతమైన కృష్ణాజిల్లా కు ఏడాదిన్నర కాలం క్రితం పంపి పత్రికా పర్యావరణాన్ని పాడు చేశారు..." తంతే బూరెలు బుట్టలో పడ్డట్టు.." ఇక్కడ చేరారు విపి గారు.
ప్రజల కోసం పనిచేసే వాళ్లు జర్నలిస్టులు. సమాజానికి సేవ చేయాలనే అభ్యుదయ భావంతో పాత్రికేయ వృత్తిని అత్యధికులు ఎన్నుకుంటారు. యాజమాన్యం ఇచ్చే అరకొర వేతనాలు వారి భుక్తి గడిచేందుకు ఏమాత్రం సరిపోవు. కేవలం తన రాతల ద్వారా ప్రజలకు ఏదైనా మేలు జరిగితే అదే చాలని తృప్తిపడే ఓ సాధారణ బడుగు జీవి జర్నలిస్టు. గతంలో ప్రింట్ మీడియా మాత్రమే రాజ్యమేలుతున్న రోజుల్లో ఎంతో కొంత ప్రభుత్వం నాటి విలేకరులను ప్రోత్సహించేది . కానీ మంది ఎక్కువైతే మజ్జిగ పలచన అయినట్లు ప్రభుత్వం ఒకపక్క అనేక సంక్షేమ విధానాలు, రాయితీలను క్రమేపీ తగ్గించి వేస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో అరకొర మేలు చేసే ప్రభుత్వానికి, సమాజ హితం కోరుకునే ఎందరో జర్నలిస్టులకు వెన్నుదన్నుగా నిలవాల్సిన జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ గత కొంతకాలంగా అకారణంగా, పాత్రికేయులు పట్ల పగ ప్రతీకారాలతో కక్షపూరిత ధోరణితో ప్రతీకార వాంఛతో రగిలిపోతూ శాడిస్ట్ తత్వం వ్యవహరిస్తోంది.
కృష్ణా జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ గత ఏడాదిన్నరగా మతిలేని విధానాలతో ఆర్దిక స్థితి గతి లేని జర్నలిస్టులపై కర్ర పెత్తనం చేస్తూ, వారికి దక్కాల్సిన కనీస సంక్షేమం, గౌరవ మర్యాదలను పక్కనే ఉన్న బంగాళాఖాతంలో కలిపేస్తుంది.
వాస్తవాన్ని పరిశీలిస్తే, జర్నలిస్టుల్లో అత్యధిక శాతం మందికి ఈనాటికి సొంత ఇల్లు కూడా లేని దుర్భర పరిస్థితుల్లో జీవనం ఎంతో కఠినంగా కొనసాగిస్తున్నారు. ఈ రంగంలో మధ్యతరగతి వర్గాల వారే అధికంగా ఉన్నారు. లక్షల అక్షరాలను చూడడమే తప్ప, పట్టుమని కళ్ళతో లక్ష రూపాయలను ఒక్కసారిగా చూసిన దాఖలాలే లేని పరిస్థితులలో పాత్రికేయులు వృత్తి పట్ల అంకితభావంతో ఏదోరకంగా పనిచేస్తూనే ఉన్నారు.ప్రభుత్వాలు ఎన్ని మారినా జర్నలిస్టుల జీవన స్థితిగతులు ఏమాత్రం మెరుగుపడడం లేదన్నది వాస్తవం.
మీడియా సంస్థలలో వివిధ హోదాలలో పనిచేస్తున్న వారు తమ ఆరోగ్యాలు సైతం లెక్కచేయకుండా రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉంటూ ప్రజాస్వామ్య విలువలు కాపాడేందుకు తమ జీవితాలు అర్పిస్తున్నారు. కానీ మీడియా సంస్థలలో పని చేస్తున్న వారిలో 90 శాతం పైగా దుర్లభమైన జీవితాన్ని ఈనాటికి అనుభవిస్తుండడం దురదృష్టకరం.
చాలీ చాలని జీతాలతో, పిల్లలను సరైన చదువులు సైతం చదివించుకోలేక, స్వంత ఇళ్ళు లేక, ఇంటి బాడుగలు కట్టలేక, అకస్మాత్తుగా తీవ్రమైన అనారోగ్యం చేస్తే తగిన వైద్యం చేయించుకునే ఆర్థిక స్తోమత లేక, ఉద్యోగ రక్షణ లేక అష్ట కష్టాలు తమ జీవితంలో ఇబ్బడి ముబ్బడిగా అనుభవిస్తున్నారు.
జర్నలిస్టులతో సత్సంబంధాలు కొనసాగిస్తూ, వారి సంక్షేమానికి కృషి చేయాల్సిన సమాచార పౌర సంబంధాల శాఖ కృష్ణాజిల్లా అధికారి అందుకు భిన్నంగా దుర్మార్గపు నీచ వైఖరి తో వ్యవహరిస్తున్నారు. బాల నాగమ్మ సినిమాలో మాయల పకీర్ తన మంత్రదండంతో ఎన్నో దుశ్చర్యలకు పాల్పడ్డట్టు , బాల నాగమ్మను మాయం చేసినట్లుగా ఈ అధికారి విపి గారు ప్రభుత్వం ఇచ్చిన అధికార దండంతో పాత్రికేయుల సంక్షేమాన్ని మటుమాయం చేస్తూ ఈ అధికారి మరింతగా పేట్రేగిపోతున్నాడు. నిత్యం అదే పనిగా వివిధ వింత విధానాలతో జర్నలిస్టులను రోజు చీల్చి చెండాడుతున్నారు .
జర్నలిస్టుల పట్ల గౌరవంతో ప్రభుత్వం అందించే సంక్షేమాన్ని దూరం చేస్తూ వారిని మానసిక వేదనకు గురి చేస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. ఎన్నో దశాబ్దాలుగా మీడియా రంగంలో ఉండి సేవలందిస్తున్న అనేకమంది సీనియర్లకు అర్హత ఉన్న అక్రిడిటేషన్ అందించకుండా.. నేను పెడితేనే.. మీకు బిక్ష అంటూ కక్షపూరితంగా శిక్షిస్తూనే ఉన్నాడు. నా పవర్ తెలుసుకొని నన్ను ప్రసన్నం చేసుకుని, తాను ఆశించిన ఆమ్యామ్య ప్రసాదం సమర్పిస్తేనే అక్రిడిటేషన్ అని, ఇలా సేకరించిన మొత్తం తనకొక్కడికే కాదని ఎంతో అసహ్యంగా యాచించడంపై సీనియర్ పాత్రికేయులకు నేరుగా తన డిమాండ్ సిగ్గు లేకుండా బహిరంగంగా తెలియజేయడం గమనార్హం. అంతేకాక వారి పట్ల అగౌరవంగా ప్రవర్తిస్తూ తన టక్కు టమారా గోకర్ణ విద్యలను ప్రదర్శించి ఏదో రకంగా మోకాలు అడ్డుపెట్టి జర్నలిస్టులకు సంక్షేమం అందకుండా చేసి తన చేతిలోని అధికార దండ శక్తియుక్తులను ఈ విధంగా దుర్వినియోగం చేస్తున్నారు. ప్రభుత్వ విధివిధానాలను నిక్కచ్చిగా అమలు చేస్తున్నాడు అని అనుకోవడానికి ఏమాత్రం ఆస్కారం లేదు.
సమాచార పౌర సంబంధాల శాఖలో తన తొలి ఉద్యోగం టైపిస్టు కాగా, ఆ స్థాయి నుంచి పదోన్నతులపై డిడి స్థాయికి వచ్చిన ఈ అధికారికి చిన్న చిన్న అమౌంట్ లని సైతం నిస్సిగ్గుగా కక్కుర్తి పడటం మొదటినుంచి అలవాటే. మీడియా అక్రిడిటేషన్స్ జారీ విషయంలో కూడా ఆమ్యామ్యాలు అందుకొని అనర్హులకు అక్రిడిటేషన్స్ దొడ్డిదారిన మంజూరు చేసినట్లు తెలుస్తోంది.
అంతేకాకుండా అక్రిడిటేషన్ పొందాలంటే అయ్యగారి ఘనతను స్తుతించాలి. సారును సాయంత్రం వేళ చెప్పిన చోటకి వెళ్లి ప్రసాదం సమర్పించి ప్రసన్నం చేసుకోవాలి. తాను డబ్బు నేరుగా తీసుకోకుండా కొందరు నాలుగో తరగతి ఉద్యోగులు తెలివిగా ఉపయోగించుకోవడం ఇతని నైజం. ఒకవేళ అవినీతి నిరోధక శాఖ వల పన్నీ పట్టుకుంటే, ఆ చిరు ఉద్యోగి మాత్రమే బలైపోతాడు తనకేమీ సంబంధం లేదని రుజువు చేసుకునేందుకు సిద్ధంగా ఉండటం ఇతని ప్రత్యేకత
ఇతని వింత ప్రవర్తనకు సీనియర్ జర్నలిస్టులు కృష్ణా జిల్లా సమాచార శాఖ కార్యాలయానికి అవసరం ఉన్నా కూడా అడుగుపెట్టలేని గడ్డు పరిస్థితులు గత ఏడాదిన్నరగా నెలకొంది.
జర్నలిస్టుల సంక్షేమానికి మీడియా అక్రిడిటేషన్ ప్రామాణికం కావడంతో, ఆ కార్డుల జారీ అంశాన్ని ఆదాయ వనరుగా మార్చుకుంటూ ఈ అధికారి ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. జర్నలిస్టుల పట్ల ఇతని వింత వైఖరికి పిసికి వేసారి గతంలో ఇతను పనిచేసిన జిల్లాలలో ఇతని దుర్మార్గ వ్యవహారాలుపై ప్రజా ప్రతినిధులకు ఫిర్యాదు చేసి అక్కడి నుంచి బదిలీ కావడానికి ముఖ్య కారణమని తెలుస్తోంది.
ఈ అధికారి ఏ జిల్లాకి ట్రాన్స్ఫర్ అవుతున్నాడంటే, అక్కడి జర్నలిస్టులే కాదు, కార్యాలయ సిబ్బంది గజగజ వణికి పోతారు. అంతటి పేరు ప్రఖ్యాతలు ఈ వింత అధికారి సొంతం చేసుకున్నాడు.
జర్నలిస్టులు
సమాజానికి చికిత్స చేసే వైద్యులు వంటి వారు. సమాజంలోని పెద్ద పెద్ద రుగ్మతలను, అనేక దీర్ఘకాల సమస్యలను పరిష్కరిస్తారు.ఐతే
ఈ అధికారి రుగ్మతను చికిత్స చేసే విషయంలో ఎలా నియంత్రణ చేయాలో అంతుబట్టక తలలు పట్టుకుంటున్నారు.
Regards,
Vijay Naidu,
Advocate and Senior Legal Reporter.
Krishna District President for All India Media Association.