logo

నరుడి బ్రతుకు నటన..!ఆలోచింపజేసే డిఫరెంట్ మూవీ

నరుడికి నటన అనివార్యం. కొన్నిసార్లు తనతో కొన్నిసార్లు ఎదుటివారితో, మరికొన్నిసార్లు చుట్టూ ఉన్న సమాజంతో.

నటన ఎక్కువైతే భ్రమలు చుట్టుముడతాయి. ఆకాశంలో తేలుస్తాయి. ఆకాశం నుంచి నేలమీదకు రావాలంటే వాస్తవాన్ని కళ్ళముందుకు తీసుకురాగలిగే ఉత్ప్రేరకం కావాలి. ఆ ఉత్ప్రేరకం మనిషి మాత్రమే కానక్కర్లేదు. ఒక సంఘటన, ఒక దృశ్యం, పుస్తకం, సినిమా ఏదైనా కావొచ్చు. అయితే బయటినుంచి బయటినుంచి వచ్చే మార్పు తాత్కాలికం. నిజమైన మార్పు తెలియాలంటే నిన్ను నువ్వు వెతుక్కుంటూ ప్రయాణం చెయ్యాలి.

సత్య యాక్టర్ అవ్వాలని కోరిక. కానీ అందుకు తగ్గ శ్రమ అతని దగ్గరలేదు. ‘బాగానే చేస్తాను కదా, నాకు అవకాశం ఇవ్వడానికి వీళ్లకొచ్చిన సమస్య ఏంటి?’ అని ఆత్మవంచన చేసుకుంటుంటాడు. తన పొరపాటు వల్ల ఒక మనిషి చావు బతుకుల్లో ఉన్నా పట్టించుకోనంత నిర్లక్ష్యం. నీకు యాక్టింగ్ రాదు అని తండ్రి,

నీ అంత చెత్త యాక్టింగ్ ఇప్పటివరకూ చూడలేదని అపరిచితుడు, అసలు నువ్వేం చేస్తున్నావో నీకు తెలుసా అని చెప్పిన స్నేహితుని మాటల్లో తనకే తెలియని కొన్ని ప్రశ్నలు ఎదురవుతాయి. సమాధానాలు వెతుక్కుంటూ ఒంటరిగా కేరళ ప్రయాణమవుతాడు.

తెచ్చుకున్న డబ్బుతో రిచ్ గా బతుకుతాడు. డబ్బులు అయిపోతాయి. చేతిలో ఉన్న ఫోన్ కూడా పోతుంది. భాష తెలియదు, చేతిలో రూపాయి లేదు. ఒక్కడు నిలబడతాడు.

అన్నట్టు కనపడే దృశ్యం, ఎదురయ్యే మనిషి, జరుగుతున్న సంఘటన ఇన్నాళ్లూ ప్రశ్నలేవో రేపుతుంటాయి. ఆ ప్రశ్నల నుంచి తనను తాను ఎలా చూసుకున్నాడు, యాక్టర్ అవ్వాలనే సత్య లక్ష్యం నెరవేరిందా అనేది సినిమా.

కరోనా తర్వాత ప్రయాణాలు మనిషి జీవితంలో భాగమయ్యాయి. గోవా, కేరళ, కర్నాటక, తమిళనాడు, అరకుల్లోని ఏ హిల్ స్టేషనూ, టీ కాఫీ ఎస్టేట్స్, ఫారెస్ట్ క్యాంపులు, బీచ్ లు కొత్త కాదు. అయితే యాత్రికుడిగా మనకు కొంత పరిమితి ఉంటుంది. వెళ్లి వచ్చే నాలుగైదు రోజుల్లో మనం ప్రదేశాలు, దృశ్యాలు, మన అనిభూతులు మాత్రమే. కానీ ఈ సినిమా కేరళలోని ఒక మారుమూల పల్లెను, పల్లె వాతావరణాన్ని, పల్లెలోని మనుషులను, రోజువారీ జీవితాల్ని తెరమీదకు తెస్తుంది.

అనాద డీ.సల్మాన్
అడ్రస్ తెలియని లేఖ
వాళ్లందరి మధ్య తనను తాను వెతుక్కునే సత్య. ఇందులో ఏ పాత్రా పరిధికి మించి ప్రవర్తించదు. ఎందుకంటే వాస్తవ జీవితంలో మనకు తెలియని అద్భుతాలు అప్పటికప్పుడు రావు.

పక్షులకు తన జీవిత పోరాటం, గమనం తప్ప ప్రత్యేక జీవిత లక్ష్యాలేం ఉండవు అంటూ చివరిలో మనిషి జీవితాన్ని పక్షితో పోల్చి చెప్పే పక్షి ఫిలాసఫీ చాలా బాగుంది.

‘నరుడి బ్రతుకు నటన’ సినిమా ప్రివ్యూ సమీక్ష ఇది… నేటివిటీ నేటివిటీ అంటూ మలయాళం , తమిళ సినిమాల్ని వెతికి చూసే తెలుగు ప్రేక్షకులకు ఆ నేటివిటీని ఓ భిన్నమైన కథాంశంతో, రొటీన్ మసాలాలకు భిన్నంగా, గుడ్ టేస్ట్‌తో అందించిన ప్రొడ్యూసర్ అభినందనీయుడు… ఈరోజు సినిమా విడుదలైంది

0
0 views