సర్వాంతర్యామి
షూటింగ్ ప్రారంభం
అక్టోబర్ 27 ఆదివారం సర్వాంతర్యామి ఫిల్మ్ షూటింగ్ విశాఖపట్నం లో గల ద్వారకానగర్ మేడిచెర్ల అపార్ట్మెంట్ లో ప్రారంభం కాబోతోంది . ఈ ఫిలిం కి కథ , మాటలు మహాలక్ష్మి , కెమెరా బి.జి. ప్రసాద్ , ప్రొడ్యూసర్ శ్రీమతి బులుసు రాజ్యలక్ష్మి గారు డైరెక్టర్ బొల్లాప్రగడ గంగాధర్ ప్రసాద్ . దైవం లేడు అనేవారికి కనువిప్పుగా ఈఫిల్మ్ స్టోరీ ఉంటుంది అని రచయిత అన్నారు అలాగే తమ మేడిచెర్ల ప్రొడక్షన్ హౌస్ బ్యానర్ పై నిర్మించిన నవరసాల నటరాజు , వైజాగ్ లెజెండ్ , ధనమా - ప్రాణమా , ఒక్కరోజు ముఖ్య మంత్రి ఫిలిమ్స్ ని ప్రేక్షకులు ఆదరించారని అలాగే తమ బ్యానర్ పై వస్తున్న సర్వాంతర్యామి ఫిలిం ని కూడా ఆదరించాలని ప్రొడ్యూసర్ కోరుకున్నారు . ప్రేక్షకుల అభిరుచి ప్రకారం ఈ ఫిలిం లో అన్ని రసాలు ఉన్నాయని ,ఈ ఫిలిం అన్ని వర్గాలవారిని ఆకట్టుకుంటుందని డైరెక్టర్ తెలిపారు . ఒక మనిషి జీవితంలో జరిగే సంఘటనలు ఏవి అతని చేతిలో ఉండవని , నుదిటి రాత ఎలా ఉంటే ,అలాగే జరుగుతుందని , కంటికి కనిపించని దైవం తన స్నేహితులు ,పరిచయస్తులు రూపంలో ప్రతీ ఒక్కలినీ అవసరం ఐనప్పుడు అదుకుంటాడని అది ప్రతీ ఒక్కలు తెలుసుకునే విధంగా ఈ ఫిలిం ఉంటుందని తెలిపారు . ఈ ఫిలిం లో వైజాగ్ సింహం అని అందరిచేత పిలవబడే బి వి ఆర్ మూర్తి గారు , నట విరాట్ డాక్టర్ హరగోపాల్ గారు , డాక్టర్ మొహ్మద్ రియాజ్ అహ్మద్ గారు , శ్రీ నందు ( నాయుడు ) పంతుల లలితగారు ఇంకా మరికొంతమంది విశాఖ కళాకారులు నటిస్తున్నారని . ఈ ఫిలిం అన్ని పనులు పూర్తి చేసుకుని నవంబర్ లో విడుదల అవుతుందని డైరెక్టర్ తెలిపారు. ఈ ఫిలిం లో కళాకారులందరిమీద ఒక మంచి సాంగ్ షూట్ చేస్తున్నామని తెలిపారు