
BJP పాలకుల వల్లే ప్రోపేషర్ సాయిబాబా అకాల మరణం :- రెముడాల పరుశరాములు
ప్రో॥ సాయి బాబా మృతికి బీజేపీ ప్రభుత్వం బాధ్యత వహించాలి
సాయి బాబా మృతికి
కేవీపీఎస్ ప్రఘాడ సంతాపం
VBSTV NEWS Nalgonda District
మానవ హక్కుల కార్యకర్త, ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ మేధావి సంపూర్ణ వికలాంగుడైన ప్రొఫెసర్ సాయి బాబాను
పదేళ్లు తప్పుడుఅభియోగాలపై జైల్లో నిర్బంధించిన నిరంకుశ మతోన్మాద బీజేపీ పాలనవల్లే ఆయన అకాల మరణం చెందాడని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవిపిఎస్ ) నల్లగొండ జిల్లా జిల్లా ఉపాధ్యక్షులు రెముడాల పరశురాములు అన్నారు .
అక్టోబర్ 12న హైదరాబాద్ నిమ్స్ లో తుది శ్వాస విడిచిన *ప్రొఫెసర్ సాయిబాబా కు కేవిపిఎస్ ప్రఘాడ సంతాపం ప్రకటించింది ఆయన మరణం భావి భారత్ కు తీరని లోటని కేవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు రెముడాల పరశురాములు అన్నారు.
సంపూర్ణ వికలాంగుడైన సాయి బాబా ను పదేళ్ల పాటు నిర్బంధించిందని ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించిన కనీస మానవీయతను మోడీ ప్రభుత్వం చూపించలేదన్నారు తర్వాత నిర్దోషి అని తీర్పు వచ్చిందన్నారు.ఆయన చావుకు మోడీ ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పారు. నిరపరాధిగా చివరకు న్యాయస్థానం తీర్పు ద్వారా విడుదలైనప్పటికీ
అప్పటికే ఆరోగ్యం దెబ్బతిన్నదని చెప్పారు సమత సమాజం కోసం ఆయన కన్న కలలను సాకారం చేయడానికి నేటి తరం కృషిచేయడం ద్వారా ఆయన ఆశయాలు నెరవేర్చాలని వారు పేర్కొన్నది ఆయన మృతికి కేవీపీస్ నల్లగొండ జిల్లా కమిటీ ప్రఘాడ సంతాపం ప్రకటిస్తూ వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపింది....