logo

డిజిటల్ హెల్త్ కార్డ్ దరఖాస్తులపై తెలంగాణ పౌరసరఫరాల శాఖ క్లారిటీ

హైదరాబాద్:డిజిటల్ హెల్త్ కార్డ్ దరఖాస్తులపై తెలంగాణ పౌరసరఫరాల శాఖ క్లారిటీ ఇచ్చింది. తాజాగా సోషల్ మీడియా,పలు మాధ్యమాల్లో సర్య్కులేట్ అవుతున్న దరఖాస్తు అసలైనది కాదని పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ తెలిపారు.
ఈ మేరకు కమిషనర్ కార్యాలయం సోమవారం(అక్టోబర్ 7) ఒక ప్రకటన విడుదల చేసింది. ఫ్యామిలీ డిజిటల్ హెల్త్ కార్డు డిజైన్ ఇప్పటివరకు ఫైనల్ కాలేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో చెలామణి అవుతున్న దరఖాస్తులను పట్టించుకోవద్దని విజ్ఞప్తి చేశారు.

17
2392 views