
కమ్యూనిస్టు పార్టీల పట్ల ప్రజలు ఆదరణ చూపుతున్నారు. ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి
VBSTV NEWS Nalgonda District
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని, దాని కోసం గ్రామ స్థాయిలో ప్రజా ఉద్యమాలు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం మిర్యాలగూడలోని గణేష్ నగర్, ప్రకాష్ నగర్, రవీంద్ర నగర్, శాఖల మహా సభలలో ఆయన పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు. ప్రజాస్వామ్యాన్ని ఖుని చేస్తున్న మోడీ ప్రభుత్వాన్ని గద్దే దింపేందుకు ప్రజా ఉద్యమాలు చేపట్టాలని కోరారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తూ ప్రజల సంపదను కార్పొరేషకులకు దోచిపెడుతున్నాడని ఆరోపించారు మత రాజకీయాలు చేస్తూ ప్రజల మధ్య విద్వేషాలు సృష్టిస్తున్నారని ప్రజలు అప్రమత్తంగా ఉండి ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టు పార్టీల పట్ల ప్రజల ఆదరణ చూపుతున్నారని ఇటీవల శ్రీలంక ఎన్నికల్లో అది రుజువైందన్నారు. ప్రపంచ మానవాళికి కమ్యూనిస్టు సిద్ధాంతమే మార్గదర్శకమని చెప్పారు. గ్రామ, వార్డు స్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసం ప్రజా పోరాటాలు నిర్వహించాలని కోరారు. ప్రజా ఉద్యమాల ద్వారానే పార్టీ బలోపేతం అవుతుందని ఆ దిశగా కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం కార్యకర్తలు పని చేయాలన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు కార్యకర్తలకు సిద్ధం కావాలన్నారు. అంతకుముందు గత మూడు సంవత్సరాలుగా చేసిన ప్రజా ఉద్యమాలపై చర్చించి భవిష్యత్తు కార్యచరణ రూపొందించారు. అనంతరం నూతన కమిటీలను ఎన్నుకున్నారు. గణేష్ నగర్ లింగయ్య, ప్రకాష్ నగర్ కార్యదర్శి గా నిరంజన్, రవీంద్ర నగర్ కార్యదర్శిగా కోటయ్య లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్, జిల్లా కమిటీ సభ్యులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, రవి నాయక్, భవాండ్ల పాండు, రాగిరెడ్డి మంగారెడ్డి, నాయకులు దేశిరాం నాయక్,సాంబ నాయక్, ముడవత్ రాము, జగన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.