logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

జిల్లా స్థాయికి ఎంపికైన సెయింట్ జోసెఫ్ విద్యార్థులు



జిల్లా స్థాయికి ఎంపికైన సెయింట్ జోసెఫ్ విద్యార్థులు

చంద్రుగొండ, సెప్టెంబర్ 25, మండల కేంద్రంలోని సెయింట్ జోసెఫ్ పాఠశాల విద్యార్థులు జోనల్ స్థాయిలో ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైనట్లు ఆ పాఠశాల పీడీ ఆఫ్రిది తెలిపారు. బుధవారం ఎర్రగుంటలో జరిగిన జోనల్ స్థాయి పోటీలలో కబడ్డీ విభాగంలో టీ లక్ష్మణ్, వై నరేందర్, వి మనోహర్, కో కో విభాగంలో ఎస్వీ మోజేష్, బాలికలు కబడ్డీ విభాగంలో సుశీ ప్రియా ,అనూష ,వాలీబాల్ విభాగంలో రిషిత, కబడ్డీ విభాగంలో హఫ్స, వాలీబాల్ విభాగంలో సమైక్య లు ప్రతిభ కనబరచడంతో వారిని జిల్లాస్థాయి లో జరిగే పోటీలకు ఎంపిక చేశారు. బుధవారం సాయంత్రం అశ్వరావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ చేతులమీదుగా మెమొంటో ప్రశంసా పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను, పిడి ఆఫ్రిదిలను పాఠశాల ప్రిన్సిపాల్ లత ఉపాధ్యాయులు అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు లక్ష్మీ, లలిత, నరేష్ లు పాల్గొన్నారు.

192
16342 views

Comment