logo

AiMA MEDiA-ఎస్ వి కోటేశ్వరరావు - అమరావతి

*ప్రజల మనోభావాలను దెబ్బతీసిన వైసిపి - ఎమ్మెల్యే గళ్ళా మాధవి*

*తిరుపతి లడ్డు అపవిత్రత పై ఆవేదన*

*అధికారంలో ఉన్న నాటి నుండే తిరుమల పవిత్రతను దెబ్బ తీసే కుట్ర చేసిన జగన్ రెడ్డి అంటూ ఆగ్రహం*


ప్రజల మనోభావాలతో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆటలాడారని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి మండిపడ్డారు. తిరుమల లడ్డును అప్పటి వైసిపి ప్రభుత్వం కల్తీ చేయడంపై ఎమ్మెల్యే గళ్ళా మాధవి ఆగ్రహం వ్యక్తం చేస్తూ శనివారం ఓ పత్రిక ప్రకటనని ఆమె విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఏ ప్రభుత్వాలు అధికారంలో ఉన్న కూడా ప్రజల మనోభావాలను కాపాడి వారి సంప్రదాయాలను గౌరవించాలని వీటికి భిన్నంగా ఎవరైనా ప్రవర్తిస్తే భగవంతుని ఆగ్రహానికి గురికాక తప్పదని గళ్ళా మాధవి తెలిపారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీసే విధంగా గతంలో అధికారంలో ఉన్న జగన్ రెడ్డి ప్రయత్నిస్తూనే ఉన్నాడని గళ్ళా మాధవి తెలిపారు.

ముఖ్యమంత్రి హోదాలో తిరుమల కి వెళ్ళినప్పుడు జగన్ రెడ్డి టీటీడీ డిక్లరేషన్ అడిగితే అధికారమదంతో ఇవ్వకుండా హిందూ మనోభావాలను దెబ్బతీశాడని, అన్యమతస్థులుగా ఉన్న వై.వి సుబ్బారెడ్డి, భూమాన కరుణాకర్ రెడ్డిని టిటిడి చైర్మన్ లుగా నియమించారని, అప్పటి చైర్మన్ గా ఉన్న వై.వి సుబ్బారెడ్డి సతీమణి జగన్ రెడ్డి రక్షక గోవిందా అంటూ, వెంకటేశ్వర స్వామిని కించపరిచే విధంగా నినాదాలు చేసిన విషయం ప్రజల ఎవరు మర్చిపోలేదని, తిరుమలకు ముఖ్యమంత్రి హోదాలో సతిసమేతంగా వెళ్తారని, కానీ జగన్ రెడ్డి ఎప్పుడైనా తన సతీమణి భారతి రెడ్డితో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారా, పట్టు వస్త్రాలైన దంపతులుగా సమర్పించారా అని గళ్ళా మాధవి ప్రశ్నించారు. అధికారంలో వచ్చిన నాటి నుండి వైసిపి మూకలు జగన్ రెడ్డి డైరెక్షన్లో ఆలయాల మీద దాడులు శ్రీరాముడి విగ్రహ తలను వధించటం నాటినుండి రథాలను తగలబెట్టడం, విజయవాడ కనకదుర్గమ్మ రెండు సింహాలను మాయం చేయటం వరకు ఈ జగన్ రెడ్డి చేయని పాపాలు లేవని గళ్ళా మాధవి ఆగ్రహం వ్యక్తం చేశారు.

గతంలో శ్రీవాణి ట్రస్ట్ పేరుతో నిధులను పక్కదారి పట్టించారని, వైసీపీ ఎమ్మెల్యేలు ఇష్టానుసారం సిఫార్సులేఖలను, ఇచ్చి సామాన్య భక్తులకు దర్శన భాగ్యానికి దూరం చేశారని ఎమ్మెల్యే గుర్తు చేశారు.

తిరుపతి లడ్డుకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది భక్తులు లడ్డు కళ్ళకు అద్దుకొని వాటిని పరమ పవిత్రంగా భావిస్తుంటారు అటువంటి లడ్డును కల్తీ చేసి గొడ్డు కొవ్వును కలిపాడు అంటే భక్తుల విశ్వాసాన్ని ఈ జగన్ రెడ్డి ఎంత తీవ్రంగా దెబ్బతీశాడు.

తిరుపతి లడ్డు అపవిత్రమైన సమాచారంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు తీవ్ర ఆవేదనకు లోనయ్యారని కొన్నిచోట్ల నిరసనలు వ్యక్తం అవుతున్నాయని సమగ్ర విచారణ జరిపి వీటికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకొని భక్తుల మనోభావాలను తిరుమల పవిత్రను కాపాడాలని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ప్రజల తరఫున ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు.

186
7899 views