
*త్వరలో డంపింగ్ యార్డ్ నిర్మాణం కాబోతుందా...?*
*గుమ్మడిదల మండలంలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు జరుగుతే భవిష్యత్తు లో ఎదురుకోబోయే నష్టాలు*....,
*గుమ్మడిదల మండల గ్రామ ప్రజలైన ... ప్యారా నగర్, నల్లవల్లి,* *లక్ష్మాపూర్.కొత్తపల్లి, నాగిరెడ్డిగూడెం. మంబాపూర్, గుమ్మడిదల, అనంతరం, కానుకుంట. వీరారెడ్డిపల్లి,రాంరెడ్డి* *భాయ్.బొంతపల్లి. దోమడుగు. అన్నారం. వీరన్న గూడెం. భవిష్యత్తులో ఈ గ్రామాలలో ప్రజలు అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్నట్టుగా కొంతమంది ప్రజలే నివసిస్తారేమో..? ఇప్పుడు మనం ప్రమాదం మంచుల్లో నివసిస్తున్నాం భవిష్యత్తు ప్రశ్నార్థకమే ? ఇది పచ్చి నిజం*
గుమ్మడిదల మండలంలో ఇక ఈ వ్యాపారాల భవిష్యత్తు ప్రశ్నార్ధకమే... ప్రజలు ఉండరు కాబట్టి వ్యవసాయం ఉండదు, వ్యవసాయం ఉండదు కాబట్టి దాని మీద ఆధారపడ్డ ....., స్కూల్లో కాలేజీలు, కిరాణం షాపులు, హార్డ్వేర్ షాపులు, ఫర్టిలైజర్స్ షాపులు, స్టీల్ సిమెంట్ షాపులు, బార్బర్ కటింగ్ షాపులు, దోబీ ఇస్త్రీ షాపులు, చికెన్ మటన్ దుకాణాలు, హోటల్లో రెస్టారెంట్లు దాబాలు, ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని వ్యాపారాలు మనం గుమ్మడిదల ప్రజలమైన మనం ప్రమాదం మంచు లో ఉన్నాము, ఇప్పుడు మేల్కొనకపోతే భవిష్యత్తు ప్రశ్నార్థకమే....? ఇది పచ్చి నిజం
# ప్రస్తుతం గుమ్మడిదల మండలంలో ఎకరా భూమి కోట్ల రూపాయల పలుకుతుంటే భవిష్యత్తులో మహా అంటే 10 లక్షల రూపాయలు అటు ఇటుగా ఉంటుంది?
# గుమ్మడిదల మండలంలో ప్రస్తుతం ప్లాట్ గజం 25 వేల రూపాయలకు అటు ఇటుగా పలుకుతుంది, మరి భవిష్యత్తులో కొనేదిక్కుంటరేమో ?
# హైదరాబాద్ మహానగరం నుండి 40% చెత్త డంపింగ్ యార్డ్ గుమ్మడిదల మండలంలో పోగు చేస్తే ఎంత భయానక పరిస్థితి ఉంటుందో గుమ్మడిదల మండలాల నాయకులకు అర్థం కావట్లేదు
# ఇప్పటికే కెమికల్ కంపెనీల వల్ల అనారోగ్యం పాలవుతున్నాము. దానికి తోడుగా ఈ డంపింగ్ యార్డ్ కూడా ఏర్పాటు చేస్తే భవిష్యత్తు ప్రశ్నార్థకమే అవుతుంది
# డంపింగ్ యార్డ్ చెత్త తోని కరెంట్ తయారు చేస్తామని చెప్తున్నారు నిజమే అనుకుందాం కరెంట్ తయారు చేస్తుంటే ఆ చెత్త వల్ల ఎన్ని రకాల కెమికల్స్ గాలిలో విడుదలవుతాయి,ఆ గాలంతా ఎక్కడకు పోతుంది గుమ్మడిదల మండలంలోని వ్యాపిస్తుంది కదా.., మన ఇంట్లో ఒకరోజు బాత్రూం జామ్ అయిందనుకుందాం ఇల్లంతా కంపు కొడుతుంది ఇంట్లో ఉండలేం. అలాంటిది రోజు చెత్త బండ్లు రోడ్ వెంబడి వెళ్తుంటే ఆ చెత్త నుంచి వాసనలు వస్తుంటే, ఆ చెత్తను కరెంట్ ఉత్పత్తి పేరుతో నానా రకాల గాలులు గుమ్మడిదల మండలంలో వ్యాపిస్తు ఉంటే ఉండగలమా..., కోళ్ల పెంట (ఎరువు )బండి రోడ్ మీద వెళ్తుంటే రెండు నిమిషాలు ముక్కు మూసుకుంటాం.... అలాంటిది వందలాది చెత్త బళ్ళు రోజు రోడ్ వెంబడి వెళ్తుంటే మరి ఎలా ఉండగలం ఒకసారి ఆలోచించండి!
# అభివృద్ధి అంటే మనుషులుంటేనే మరి ఈ ప్రాంతంలో మనుషులే నివసించకుంటే
అయ్యా గుమ్మడిదల మండల రాజకీయ నాయకులారా ఇంతకాలం మా ఓట్లతో ఎంపీపీలు.జెడ్పీటీలు. సర్పంచులు. వార్డ్ మెంబర్లు.అయ్యారు సంతోషం ఇప్పుడు మీరు ముందడుగు వేసి దీన్ని ఆపకపోతే మీ భవిష్యత్తు కూడా అధోగతే గుర్తుంచుకోండి... ఇంతకాలం మీరు చేసిన రాజకీయం చాలు ఇప్పుడు మీరు తెలివైన రాజకీయాలు చేయాల్సిన సమయం వచ్చింది, మీ తెలివైన రాజకీయాలు చేసి మా జనాలను కాపాడుతారా. లేకపోతే అభివృద్ధి పేరు చెప్పి మీకు వంద పడకల హాస్పిటల్ కట్టిస్తామని మభ్య పెడతారా ఆలోచించుకోండి...?
*సంకల్పం గొప్పదైతే సాధించడం సులువు*
*చిన్న ఉదాహరణ*:- నల్లమల్ల అడవుల్లో కేంద్ర ప్రభుత్వం యురేనియం ప్లాంట్ పెట్టాలని ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించింది. సాక్షాత్తు ప్రస్తుత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గంలో అక్కడి ప్రజలు నల్లమల్ల అడవుల్లో అనేక మూగజీవాలు నివసిస్తున్నాయి వాటి ప్రాణానలకు ప్రమాదకరం అని సుప్రీంకోర్టు వరకు వెళ్లారు. వెయ్యిల కోట్లు సంపాదించాల్సిన కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు ఆగిపోయింది, మరి మన నర్సాపూర్ అడవుల్లో మూగజీవాలు లేవా అవి చనిపోవా ఒకసారి ఆలోచించండి
ఇప్పటికే దుండిగల్ ఎయిర్పోర్ట్ తో, కెమికల్ కంపెనీల వల్ల, హైదరాబాద్ దగ్గరలో హైదరాబాద్ తో పోటీ పడాల్సిన మనం అభివృద్ధి ఆమడ దూరంలో ఉన్నాం ఇక డంపింగ్ యార్డ్ కూడా ఏర్పాటు చేస్తే గుమ్మడిదల మండలం ప్రాంతం బొందల గడ్డ తప్ప దేనికి పనికిరాదు
గమనిక :- గుమ్మడిదల మండలంలోని ప్రతి గ్రామానికి ప్రతి ఇంటి గుమ్మాన్ని ఈ సందేశం వెళ్లాలి మిత్రులారా ఆలోచించండి
తస్వత్ జాగ్రత్త