logo

బదిలీపై వెళ్తున్న విజయ్ కుమార్ కు సన్మానం

చంద్రుగొండ సెప్టెంబర్ 13 : జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నాలుగో క్లాస్ ఉద్యోగ దీర్ఘకాలం పనిచేసి బదిలీపై ఎర్రగుంట ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు బదిలీ అయిన విజయకుమార్ను చంద్రుగొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్తులు విద్యార్థులు వివిధ పార్టీల నాయకులు శుక్రవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ పని చేసినంత కాలం విద్యార్థులకు అన్ని రకాల తోడ్పాటు అందిస్తూ తలలో నాలుకల ఉంటూ అందరి మన్ననలు పొందాడని విజయకుమార్ను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వాజీద్, ఉపాధ్యాయులు, గ్రామస్తులు, మాజీ జడ్పిటిసి కొనగండ్ల వెంకటరెడ్డి ధారా బాబు, భూపతి రమేష్, వెంకటేశ్వర్లు, వంకాయలపాటి బాబురావు నాయకులు పాల్గొన్నారు

19
871 views