logo

ఎంబీబీఎస్ సీటు సాధించిన *ప్రశంస* కి ప్రశంసల వెల్లువ...!!


గుడిహత్నూర్:- 1996 SSC బ్యాచ్ కి చెందిన Dr బొర్రా లక్ష్మణ్ గారి కూతురు NEET 2024 తెలంగాణ రాష్ట్ర బాలికల కేటగిరిలో ప్రముఖ AIIMS విజయవాడ లో MBBS మొదటి సంవత్సరం సీటు సాధించిన శుభ సంద్బంగా *బొర్రా ప్రశంస* కు శుభాకాంక్షలు తెలుపుతూ గుడిహత్నూర్ బస్టాండ్ ఎదుట ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారి మిత్రుడు PACS చైర్మన్ ముండే సంజీవ్ మాట్లాడుతూ తమ మిత్రుడు బొర్రా లక్ష్మణ్ కడు పేదరికం నుంచి ఉన్నత స్థాయికి ఎదిగి తన పిల్లలను కూడా ఉన్నత చదువులు చదివించి వారిని ఉన్నత స్థాయికి ఎదిగేందుకు ప్రోత్సహించడం మా అందరికీ స్ఫూర్తి దాయకమని అన్నారు.
ఈ సంద్భంగా వారి మిత్రులు మాజీ సర్పంచ్ రవి నాయక్, నీలకంఠ అప్ప, కిషన్ బుద్దె లు కూడా ప్రశంసకు శుభాకాంక్షలు తెలియజేశారు.

0
1273 views