logo

AiMA MEDiA-ఎస్ వి కోటేశ్వరరావు - విజయవాడ

*విజయవాడ వరద బాధితులకు కూరగాయలు, నిత్యావసరాలు పంపిణి*

గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 29వ డివిజన్ కమిటీ సహకారంతో టీడీపీ బిసి సెల్ ఆధ్వర్యంలో ఆదివారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయం వద్ద "విజయవాడలోని వరద బాధితులకు కూరగాయలు,నిత్యావసర సరుకుల వాహానాలకు" ఎమ్మెల్యే గళ్ళా మాధవి జెండా ఊపి పంపారు. ఈ సందర్భముగా గళ్ళా మాధవి మాట్లాడుతూ... ఆపద సమయంలో చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి, తమ తోచిన విధముగా ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తున్నారని, ఇందులో భాగంగానే బిసి సెల్ మరియు 29వ డివిజన్ కమిటీ , విజయవాడ సమీపంలోని ఒక లంక గ్రామం మొత్తం నిత్యావసరాలు పంపిణి చేయటానికి ముందుకు రావటం అభినందనీయమని గళ్ళా మాధవి తెలిపారు

113
2427 views