పైడితల్లమ్మ ఆలయంలో ఘనంగా గణేశ్ పూజలు
విజయనగరం ప్రజల ఆరాధ్య దైవం శ్రీ పైడితల్లమ్మ
చదురుగుడిలో వినాయక చవితి సందర్భంగా మట్టి
వినాయక ప్రతిమకు ప్రత్యేక పూజలు చేశారు. వివిధ
రకాల పత్రి, పాలవెల్లితో, పుష్పాలతో పూజలు చేశారు.
ముందుగా అమ్మవారికి ఆలయ అర్చకులు వేకువజాము
నుంచి పంచామృతాభిషేకాలు, పూజలు నిర్వహించారు.
భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వినాయకుని,
అమ్మవారిని దర్శించుకున్నారు.