logo

చల్మెడ అంగన్​వాడీ సెంటర్లలో పోషణ మహోత్సవాలు...

ఘనంగా నిర్వహించిన అంగన్వాడి టీచర్లు
ప్రజాబలం - నిజాంపేట మండలం
,06-09-2024:
మెదక్​ జిల్లానిజాంపేట్ మండలం చల్మెడ గ్రామంలో గల అంగన్వాడి సెంటర్లో పోషణ మాసోత్సవ కార్యక్రమాలను ఆయా అంగన్​వాడీ సెంటర్లలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా శుక్రవారం గ్రామంలోని అంగన్వాడి సెంటర్ లో ఐసీడీఎస్​ ఉన్నతాధికారుల సూచనల మేరకు పౌష్టికాహారంపై మినిట్స్​, ఆకుకూరలు, పండ్లు, కూరగాయలు, బెల్లం, పాలు, గుడ్లు, చేపలు, మాంసం ప్రతిరోజూ తినే ఆహారంలో సమతుల ఆహారం ఉండేలా చూసుకోవాలని వివరించారు. ఈ సందర్భంగా అంగన్​వాడీ సెంటర్​లో టీచర్లు ఆధ్వర్యంలో పోషణ మాసోత్సవాల్లో మహిళా సాధికారిక గురించి మాట్లాడుతూ... చైల్డ్ మ్యారేజ్, వరకట్న వేధింపులు, గృహహింస, సఖి సేవల గురించి వివరించారు. బాలికలకు అత్యవసర సమయంలో టోల్ ఫ్రీ నెంబర్లు 181,1098,100 అత్యవసరంలో ఉపయోగించుకోవాలని సూచించారు. పోషన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా .తల్లులందరికీ సరైన పోషకాహారం, సమతుల ఆహారం, చిరుధాన్యాలు, ఆకుకూరలు తీసుకోవాలని జాగ్రత్తలను తెలియజేశారు. పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత, పిల్లల పెరుగుదల కుంటు పడితే జరిగే అనర్ధాలు, తీవ్ర లోప పోషణకు సంబంధించి వివరాలను గర్భిణిలు, బాలింతలు, మహిళలకు తెలిపారు. మెంటల్ హెల్త్ ప్రోగ్రాం ద్వారా మానసిక సమస్యలు ఉంటే14416 టోల్ ఫ్రీ కి కాల్ చేసి కౌన్సిలింగ్ సేవలు కూడా పొందవచ్చన్నారు అనంతరం గర్భిణీలు, బాలింతలు, మహిళలు పౌష్టికాహారం తీసుకుంటామని... అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు ప్రైమరీ స్కూల్ టీచర్లుఆయాలు,గ్రామ ప్రజలు,మహిళలు,విద్యార్థి విద్యార్థులు పాల్గొన్నారు.

12
2997 views