logo

సమాజ నిర్మాణానికి గురువులు మూలం.

ఉపాధ్యాయుడు నిత్య విద్యార్థి

టీచర్ ఎం ఎల్ సి కూర రాఘోత్తం రెడ్డి

మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

ప్రజాబలం దినపత్రిక - మెదక్ జిల్లా ప్రతినిధి
5-9-2024:

మెదక్ కలెక్టర్ కార్యాలయంలోని సమావేశం మందిరంలో బుధవారం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదిన సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూరా రాఘోత్తం రెడ్డి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ హాజరై ప్రసంగించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతిని పురస్కరించుకొని మనం ప్రతి ఇయర్ కూడా సెలబ్రేట్ చేయడం జరుగుతోంది.
ఆయన జీవితం కూడా మనందరం కూడా ఒక ఆదర్శప్రాయాన్ని జీవితంతో ఒక వైస్ ప్రెసిడెంట్ స్థాయి వరకు కూడా ఆయన వెళ్లడం మన అందరికి కూడా ఇన్స్పిరేషన్ అన్నారు.
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మనందరిని ప్రేరణపరచిన, మనకు జీవన పాఠాలు నేర్పిన గురువులను స్మరించుకోవాలన్నారు.
గురువు తన విద్యార్థుల జీవితాలలో కాంతి చూపించే దీపం.
వారి మార్గనిర్దేశం మన భవిష్యత్తును సాకారం చేసే శక్తిని ఇస్తుంది.
ఉపాధ్యాయులు కేవలం పాఠాలు నేర్పించే వారు కాక, మంచి విలువలను, ఆలోచనలను, జీవితంలో విజయవంతం కావడానికి కావలసిన మార్గాలను కూడా నేర్పిస్తారన్నారు.
టీచర్ ఎమ్మెల్సీ మాట్లాడుతూ
గురువు అంటే "మార్గదర్శి, నిపుణుడు, ఉపాధ్యాయుడు అని భారతీయ సంప్రదాయంలో గురువు అందరికంటే కంటే ఎక్కువ. సాంప్రదాయకంగా, గురువు శిష్యుడికి లేదా విద్యార్థికి గౌరవప్రదమైన వ్యక్తి. గురువు శిష్యునికి జీవిత విలువలను నేర్పించే బోధకుడు, సాహిత్య జ్ఞానంతో పాటు, తన అనుభవ జ్ఞానాన్ని పంచేవాడు, విద్యార్థి జీవితంలో ఒక ఆదర్శ వ్యక్తి, స్ఫూర్తిదాయకమైన వ్యక్తి అని కొనియాడారు.
అనంతరం జిల్లా వ్యాప్తంగా 50 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు మెమెంటో, శాలువా తో సన్మానం చేశారు.
ఈ కార్యక్రమం లో జడ్పీ సీఈఓ ఎల్లయ్య, జిల్లా విద్య అధికారి రాధా కిషన్,మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, మండల విద్యాధిరులు,ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

0
1221 views